• Category Banner Ad
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • నీది నాది ఒకే కథ సినిమా రివ్యూ (23/03/18)

  Posted on 23 Mar, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/03/18..   04.30pm)
                 యంగ్ హీరో శ్రీవిష్ణు, సాట్నా టిటస్ లు జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.  
  కథ :
        ఒక లెక్చరర్ కొడుకైన సాగర్ (శ్రీవిష్ణు) కు చిన్నప్పటి నుండి చదువు సరిగా ఎక్కదు. బ్రతకడ మంటే నచ్చిన పని చేసుకుని సంతోషంగా ఉండటమే అనుకునే సాగర్ తాను అమితంగా ప్రేమించే తండ్రిని మెప్పించాలని డిగ్రీ పాసవడానికి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఒకానొక దశలో తనకు నచ్చింది చేయడానికి వీలుకాక, తండ్రికి నచ్చినట్టు మారలేక తీవ్ర ఒత్తిడికి, వేదనకు గురై ఇంట్లోంచి కూడ బయటికొచ్చేస్తాడు. అలా బయటికొచ్చిన సాగర్ ఏమయ్యాడు, చివరికి అతని భాధ అతని తండ్రికి అర్థమయ్యిందా లేదా అనేదే ఈ సినిమా కథ.

  ప్లస్ పాయింట్స్ :
               దర్శకుడు వేణు ఊడుగుల చాలా మంది యువకుల జీవితాల్లో ఉండే ఒక కీలకమైన దశనే తన సినిమా కథగా ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే సజీవమైన పాత్రల్ని, వాతావరణాన్ని కథలో ఇనుమడింపజేసి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈరోజుల్లో తల్లి దండ్రులు తమ పరువు కోసం పిల్లలపై ఎలాంటి ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు, అది పిల్లల్ని ఎలా ఇబ్బందిపెడుతోంది, తమ ఆశల కోసం పిల్లల ఇష్టాల్ని, కోరికల్ని తల్లిదండ్రులు, టీచర్లు ఎలా చిదిమేస్తున్నారు అనే అంశాలని బలంగా చూపాడు.
  సినిమా ఆరంభం నుండి ఆఖరి వరకు నడిచే తండ్రీ కొడుకుల ట్రాక్ చూస్తే ప్రతి ఒక్కరికి తమ ఇళ్లలోని జరిగిన, జరుగుతున్న సంఘటనలు, వ్యవహారాలే గుర్తుకొస్తాయి. మరీ ముఖ్యంగా నచ్చినట్టే బ్రతకాలని ఇంట్లో వాళ్లతో వాదించే కుర్రాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్టయి ఆహా.. మన కథే తెర మీద నడుస్తోంది అనిపిస్తుంది. అదే విధంగా పిల్లలు ఎలాగైనా బాగుపడాలని కోరుకునే తండ్రుల తపన కూడ ఈ సినిమా చూస్తే అవగతమవుతుంది. ఈ ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వచ్చే కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలు మనసును కదిలిస్తాయి.
   
  మైనస్ పాయింట్స్ :
          ఫస్టాఫ్లో హీరో రాయలసీమ యాసలో మాట్లాడటం బాగానే ఉన్నా డబ్బింగ్ కొంత భాగం వరకు సరిగా కుదరక కొన్ని మాటలు అసహజంగా అనిపిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కోరుకునే కామెడీ, ఫైట్స్, రొమాన్స్, పాటలు లాంటి విషయాలేవీ ఈ సినిమాలో దొరకవు.  ఆసక్తికరంగా నడిచే కుర్రాడి కథలోకి హీరోయిన్ రూపంలో ప్రవేశించిన ప్రేమ, పాటలు కూడ సినిమా వేగాన్ని కొంత నెమ్మదించేలా చేశాయి. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్ లో హీరో తనకు నచ్చినట్టే బ్రతకాలని నిర్ణయించుకుని బయటికొచ్చాక అతనెలా బ్రతికాడు అనే అంశాన్ని కొంత వివరంగా చూపించి ఉంటే హీరో పాత్రకు కనెక్టయ్యే యువ ప్రేక్షకులకు ఇంకాస్త సంతృప్తి దొరికే ఛాన్స్ ఉండేది.
   
   
  Be the first one to comment. Click here to post comment!