• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ఎం.ఎల్.ఏ సినిమా రివ్యూ (23/03/18)

    Posted on 23 Mar, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/03/18..   04.30pm)
                  కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎం.ఎల్.ఏ’  ప్రేక్షకుల ముందుకొచ్చింది
    కథ:
              కొన్ని అనుకోని కారణాల వల్ల ఇందు (కాజల్) ఇంట్లోనుండి బయటికి వచ్చి ఒక కంపెనీకి ఎం.డి అవుతుంది. అక్కడ కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) ఇందును చూసి ప్రేమిస్తాడు. కొంతకాలం తరువాత ఇద్దరు ఇష్టపడతారు. ఒక సందర్భంలో ఇందు తల్లితండ్రులు ఇందుతో పెళ్లి జరగాలంటే ఎం.ఎల్. ఏ అవ్వాలని కళ్యాణ్ కు షరతు పెడతారు. అసలు ఇందు తల్లిదండ్రులు కళ్యాణ్ కు ఎం.ఎల్.ఏ అవ్వాలనే కండిషన్ ఎందుకు పెట్టారు ? ఎం.ఎల్.ఏ అవ్వడానికి కళ్యాణ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేదే ఈ సినిమా కథ.
    ప్లస్ పాయింట్స్ :
             కథానాయకుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. నటుడిగా అయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫిట్ గా కనిపిస్తూ సరికొత్త లుక్స్ తో ఆకట్టుకున్నారు. మాస్ డైలాగ్స్ బాగా చెప్పి అలరించాడు. రవికిషన్ కు కళ్యాణ్ రా కు మధ్యన జరిగే సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడ మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చారు. కాజల్ అందం, అభినయం బాగున్నాయి. ద్వితీయార్థంలో పల్లెటూరు అమ్మాయిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి మెప్పించింది. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్విల కామెడి పరువాలేదు. మంచి లొకేషన్లలో చిత్రీకరించిన మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట బాగుంది. ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. దాని వలన సెకండాఫ్ మీద ఆసక్తి పెరిగింది. ఇక ద్వితీయార్థంలో పేద ప్రజలకు హీరో చేసే మేలు, వారి కోసం ఆలోచించే విదానం బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను రూపొందించి క్వాలిటీ సినిమాను అందించారు.

    మైనస్ పాయింట్స్ :
          అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంఎల్ఎ అవ్వాలనుకోవడం కొత్త పాయింట్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రాసుకున్న ఈ లైన్ బాగున్నా దాన్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరుకు విఫలమయ్యాడని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా ఉంది. అందుచేత సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథకు పెద్దగా కనెక్ట్ కాలేడు. హీరో విలన్ తో ఛాలెంజ్ చేసి ప్రజలకు మంచి చేయటం వంటి అంశాలని ఇదివరకే చాలా సినిమాల్లో మనం చూసాం. ఈ సినిమా కూడా అదే ధోరణిలో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కంపెనీలో చాలా సన్నివేశాలు సినిమాకు అవసరం లేదనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నా, అప్పుడే సినిమాలోని అసలు కథ మొదలైనా తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల్లకు సులభంగా తెలిసిపోతుంటుంది. దీంతో సినిమా పట్ల పెద్దగా ఎగ్జైట్మెంట్ అనేది కలుగదు.
     
     
    Be the first one to comment. Click here to post comment!