• vijay opticals
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • Category Banner Ad
 • Jaithra Business Solutions
 • రంగస్థలం సినిమా రివ్యూ (30/03/18)

  Posted on 30 Mar, 2018 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (30/03/18.. 04.30pm)
               మెగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘రంగస్థలం’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశారు.  
  కథ :
             రంగస్థలం అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు (రామ్ చరణ్) అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి (సమంత)ని ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత ముప్పై ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకుతినే ప్రెసిండెంట్ ఫణీంధ్ర భూపతి (జగపతిబాబు) అక్రమాల్ని తట్టుకోలేక, ఊరి బాగు కోసం చిట్టి బాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అతనికి పోటీగా ప్రెసిండెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడ కష్టపడుతుంటాడు. ఆ నామినేషన్ తో చిట్టిబాబు, కుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తెలెత్తుతాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ.

  ప్లస్ పాయింట్స్ :
                  సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ, పాత్రలు సినిమాతో ప్రేక్షకుడు మమేకమయ్యేలా చేశాయి. గ్రామీణ నైపథ్యంతో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. సెకండాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అమాయకత్వం, ధైర్యం, ప్రేమ, పగ కలగలిసిన కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోయారు. ఎక్కడా తడబడకుండా వినికిడి లోపం ఉన్నవాళ్లు ఎలాగైతే స్పందిస్తుంటారో అలానే స్పందిస్తూ, గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గొలిపింది. ఆమెకు, చరణ్ కు మధ్యన నడిచే ప్రతి సన్నివేశం అందంగా, ఎంజాయ్ చేసే విధంగా ఉంది. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమ్మత్తగా అనసూయ, ప్రతినాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ, మౌనికల ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకుడ్ని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి.
  మైనస్ పాయింట్స్ :
                సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండాఫ్లోనే ఉండటంతో ఫస్టాఫ్ నుండి ఫన్, చరణ్ పెర్ఫార్మెన్స్, సెట్ వర్క్, పాత్రలు, పాటలు మినహా కథ పరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పెర్ఫార్మెన్స్ బాగున్నా సెకండాఫ్ అయినంత ఎమోషనల్ గా ఫస్టాఫ్ కనెక్ట్ కాలేకపోయింది. సెకండాఫ్ ఆరంభం కూడ కొంత సాగదీసిన ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. ‘జిగేలు రాణి’ ఐటమ్ సాంగ్ కూడ ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవీ దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగ పూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరంలేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్టు తోస్తుంది.
   
   
  Be the first one to comment. Click here to post comment!