• Jaithra Business Solutions
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • ఛల్ మోహన్ రంగ సినిమా రివ్యూ (5/4/18)

  Posted on 05 Apr, 2018 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (05/04/18..    04.30pm)
               నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమా గురువారం  ప్రేక్షకుల ముందుకొచ్చింది.  
  కథ :
           మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు మోహన రంగ (నితిన్) అమెరికా వెళితే సాలిడ్ గా సెటిలై పోవచ్చు అనే ఉద్దేశ్యంతో అనేక ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడే అతనికి మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఒక దశలో ఆ స్నేహమే ప్రేమని తెలుసుకుంటారు ఇద్దరు. కానీ ఒకరి లైఫ్ స్టైల్ మరోకరి లైఫ్ స్టైల్ కు మ్యాచ్ అవ్వదనే కన్ఫ్యూజన్లో ప్రేమని వ్యక్తపరుచుకోకుండానే విడిపోతారు. అప్పటి నుండి ఇద్దరికీ ప్రశాంతత ఉండదు. అలా దూరమైన ఇద్దరూ కొంత కాలానికి తమ ప్రేమ సరైనదేనని, ఒకరికొకరు సరిపోతారని ఎలా ఎప్పుడు గుర్తించారు, ఎలా కలుసుకున్నారు అనేదే తెరపై నడిచే కథ.

  ప్లస్:
           నితిన్ ఒక హీరోలా కాకుండా నార్మల్ మధ్య తరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు మోహన్ రంగ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు కృష్ణ చైతన్య అమాయకత్వాన్ని, నిజాయితీ ని, హాస్యాన్ని మేళవించి కథానాయకుడి పాత్రను తెరపై అవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించింది. ఆమెకు, నితిన్ కు మధ్యన నడిచే ఫన్నీ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ ఆరంభం నుండి చివరి వరకు అన్ని పాత్రల ద్వారా హాస్యాన్ని పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా చోట్ల సఫలమై నవ్వులు పూయించింది. చిత్రంలోని పాటలు చాలా వరకు మెప్పించాయి. త్రివిక్రమ్ అందించిన కథ సాధారణమైనదే సెన్సిబుల్ గా అనిపించింది. సినిమాలో చాలా చోట్ల త్రివిక్రమ్ ప్రాసలతో కూడిన డైలాగ్స్ భలేగా పేలాయి.

  మైనస్:
               త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సెన్సిబుల్ కథను పూర్తిస్థాయి ఎమోషన్ ను క్యారీ చేసేలా డెవలప్ చేయలేకపోయారు దర్శకుడు కృష్ణ చైతన్య. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, హీరో పాత్రతో, డైలాగులతో నెట్టుకొచ్చిన ఆయన ద్వితీయార్థంలో సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్లలేకపోయారు. హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఎలివేట్ అయ్యేలా బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనబడలేదు. హీరో హీరోయిన్లు ఒక చిన్నపాటి క్యాజువల్ మీటింగ్ కు ఒకరు రాలేదని మరొకరు అపార్థం చేసుకుని విడిపోవడం కొంత సిల్లీగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఫన్నీ సీన్స్ మినహా ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సినిమా నీరసంగా ముగిసిన ఫీలింగ్ కలిగింది.
   
   
  Be the first one to comment. Click here to post comment!