• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • సాంఘిక దురాచారాలపై ఉద్యమం సాగించిన యుగ పురుషుడు వీరేశలింగం (16/4/18)

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/4/18.. 01.00pm)
                 నవయుగ కవితాలచక్రవర్తి కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలను జిల్లా సర్వోదయ మండలి సభ్యులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో  సోమవారం స్థానిక ఎస్ సిహెచ్ బిఆర్ఎం హైస్కూల్ లో నిర్వహించారు. ముందుగా వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించి, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా హైస్కూల్ హెచ్ ఎం కలిగొట్ల గోపాలాశర్మ మాట్లాడుతూ కోటిలింగాలు కొట్టుకుపోయిన మిగిలింది ఒకేలింగం అదే వీరేశలింగమని, సాంఘిక దురాచారాలను ఎండగడుతూ ఉద్యమం సాగించిన వీరేశలింగం యుగ పురుషుడని అన్నారు. రచయిత తెలుగు పండితులు బివి రత్నమాల జ్యోతి వెలిగించి కందుకూరి జీవితంపై వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, బంగారమ్మ, జిపిసి శేఖర్ రాజు, రామభద్రిరాజు, రామరాజు, నాగరాజు, సత్యనారాయణ, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!