• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే .. వైఎస్సార్ సిపి, జనసేన, సిపిఎం డిమాండ్ (16/4/18)

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/4/18.. 01.00pm)
              భీమవరంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైకాపా, జనసేన వామపక్ష నాయకులు బస్సులను అడ్డుకుని ఆందోళన చేశారు. దీంతో డిపోలో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. దుకాణాలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ప్రైవేటు‌ పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
          ఈ సందర్బంగా వైఎస్సార్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, భావితరాల కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా సహకరించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని బంద్ పాటిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనసేన నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు, సిపిఎం నాయకులు మాట్లాడుతూ ముందు ముందు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని  అన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!