• Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • వెంకటేశ్వరస్వామి మందిరంలో అన్న సమారాధన (16/4/18)

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/04/18..   04.00pm)
                   హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీపద్మావతి వెంకటేశ్వరస్వామి మందిరంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీనివాస చార్యులు ఆధ్వర్యంలో స్వామివారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహానివేదన చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. సుమారు 3 వేల భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కంతేటి వెంకట్రాజు, కుక్కల బాల, అల్లూరి బంగార్రాజు, కొత్తపల్లి శివశంకర్ ప్రసాద్, ఏవి రామారావు, జి మల్లేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!