• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • నీటి సరఫరా సమయంలో విద్యుత్తు కోత.. ఎస్‌ఈ సుధాకర్‌

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/4/18.. 04.30pm)
              పట్టణాల్లో వేసవిలో మంచినీటి ఇక్కట్లు అధిగమించాలంటే నీటి సరఫరా సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడమే శరణ్యమని ప్రజారోగ్య ఎస్‌ఈ సుధాకర్‌ అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై పురపాలక సంఘాల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో విద్యుత్తు శాఖ అధికారులతో చర్చిస్తానన్నారు. భీమవరం పట్టణంలో అమృత్‌ పనుల తీరును పరిశీలించేందుకు సోమవారం వచ్చారు. ఆయన భీమవరం పురపాలక అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతో అమృత్‌ పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో మూడు సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. అలాగే పట్టణంలోని చెరువులను నీటితో పూర్తిగా నింపాలని సూచించారు. అమృత్‌ పనులు జరుగుతున్న పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు వివరించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!