• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • బాల్యం నుంచి విద్యార్థులకు ప్రమాదకర విషయాలపై అవగాహనా కల్పించాలి (17/4/18)

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18..    04.30pm)
               బాల్యం నుంచి ప్రమాదకర విషయాలపై అవగాహనా కల్పించాలని, వేసవికాలమే కాకుండా అనునిత్యం అగ్నికి దూరంగా ఉండాలని భారతీయ విద్యాభవన్స్ ప్రిన్సిపాల్ ఎల్వి రమాదేవి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన్స్ విద్యార్థులకు మంగళవారం అగ్ని ప్రమాదాలు - నివారణ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా భీమవరం ఫైర్ ఆఫీసర్ జాన్ అహ్మద్ మాట్లాడుతూ పిల్లలకు అగ్గి పెట్టెలు, మందుగొందు సామాగ్రి ఇత్యాది అగ్నికి సంబంధించిన వస్తువులు ఇవ్వకూడదని, అగ్ని ప్రమాదం జరిగితే చేయవల్సిన చర్యలు సోదాహరణంగా ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో భవన్స్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ షీలా, చెరుకువాడ రంగసాయి, పైడిరాజు ప్రభావతి, సత్యనారాయణ, శేఖర్, ఎం ప్రసాదరావు, సుబ్బారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!