• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • విద్యార్థులకు ఉపాధ్యాయులు దిశానిర్ధేశకులు .. విద్యార్థులకు బహుమతులు అందజేత (17/4/18)

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18..    04.30pm)
                     విద్యార్థులకు ఉపాధ్యాయులు దిశానిర్ధేశకులని, ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణని పీఎస్ఎం బాలికోన్నత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కోడె వెంకట్రావు అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ మహానీయులను భావితరాలకు తెలియజెప్పడం మనందరి బాధ్యతని,  సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట సంపూర్ణ హాజరువచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రశంసాపత్రాలను ఇచ్చి సత్కరించడం ఒక శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఉపాధ్యాయులు జి హనోక్, పితాని గోపాలకృష్ణ, వారణాసి రాధాకృష్ణ, మూర్తి, మహాలక్ష్మి, షర్మిల, సుధా, రాణి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!