• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • అగ్నిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని తహసీల్దార్ కు వినతి (17/4/18)

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18..    04.30pm)
                   అగ్నిగోల్డ్ బాధితులు పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వంలో చలనం లేదని వారిని వెంటనే అడ్డుకోకపోతే ప్రభుత్వం అంతు చూస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాంప్రసాద్ హెచ్చరించారు. థి భీమా అగ్రిగోల్డ్ పరివార్ ఏజెంట్స్ ఆధ్వరంలో అగ్ని బాధితులకు న్యాయం చేయాలనీ కోరుతూ మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా సీతారాంప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ళు గడుస్తున్నా అగ్ని బాధితులకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయకపోతే మరింత మంది గుండెలు పగిలి చనిపోతారని అన్నారు.  కార్యక్రమంలో కె గోపాలకృష్ణ, ఎం చల్లారావు, డి వెంకటేశ్వర్లు, ఎం సాయిబాబు, ఎం సుబ్బారావు, పెన్మెత్స రంగరాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!