• vijay opticals
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • భరత్ అనే నేను సినిమా రివ్యూ (20/4/18)

  Posted on 20 Apr, 2018 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/4/18... 11.30am)
             సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కొరటాల శివ హిట్ రూపొందిన చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రిన్స్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం థియేటర్లోకి వచ్చింది.  

  కథ :
         ఇంగ్లాండ్ లో ఉంటూ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో కొత్త కొత్త డిగ్రీలు చేసే కుర్రాడు భరత్ (మహేష్ బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి (శరత్ కుమార్) మరణంతో ఇండియా తిరిగొచ్చి పెద్దల మాటతో బలవంతం మీద ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరిస్తాడు. రాజకీయాలు గురించి, రాష్ట్ర పాలన గురించి, పార్టీలోని రాజకీయ నాయకుల గురించి ఏమాత్రం అవగాహన లేని భరత్ ఎలా పరిపాలన కొనసాగించాడు ? ప్రమాణస్వీకారంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అడుగడుగునా ఎలా తపించాడు ? రాష్ట్రాన్ని బాగుచేయడంలో ఎలాంటి కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు, ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ.

  ప్లస్ పాయింట్స్ :
       సినిమాకి ప్రధాన బలం నిస్సందేహంగా మహేష్ బాబే. ముఖ్యమంత్రి పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన అద్భుతంగా పండి సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. కథ పరంగా చెప్తే సినిమా చాలా సింపుల్ గానే ఉంటుంది. కానీ దానికి మహేష్ పెర్ఫార్మెన్స్ ను యాడ్ చేసి చూస్తే మాత్రం గొప్పగా ఉంటుంది. అంతలా సినిమాను నిలబెట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహేష్. విదేశాల్లో చదువుకుంటూ, రాజకీయాల గురించి అస్సలు అవగాహన లేని ఒక మామూలు కుర్రాడు ముఖ్యమంత్రి అయితే ఎలా నడుచుకుంటాడు, పరిపాలన ఎలా సాగిస్తాడు, వ్యవస్థలో అందరికీ జవాబుదారీతనం ఉండాలని ఎలా పనిచేస్తాడు అనే సున్నితమైన అంశాల్ని మహేష్ తెర మీద పలికించిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కొరటాల శివ ఎప్పటిలాగే సోషల్ మెసేజ్ చెప్పినా కమర్షియల్ విలువల్ని వదిలిపెట్టకూడదనే తన ప్రాథమిక సూత్రాన్ని పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన సినిమాను రూపొందించారు. ఒక స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్ర చేస్తున్నాడంటే అందులో రియల్ లైఫ్ రాజకీయనాయకుల ఛాయలు మొత్తంగా కాకపోయినా కొంతైనా కనబడతాయి…కానీ కొరటాల మాత్రం సిఎం భరత్ పాత్ర ఏ నాయకుడ్ని ప్రతిబింబించేలా ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ప్రజా సమస్యల్ని ఆధారం చేసుకుని ఆయన రాసిన సన్నివేశాలు, వాటికి చూపిన పరిష్కారాలు ప్రేక్షకులకి బాగా కనెక్టవుతాయి. ఫస్టాఫ్లో వచ్చే మహేష్, కైరా అద్వానీల లవ్ ట్రాక్, మహేష్ సిఎం అవ్వడం, ప్రజల సమస్యల్ని తీర్చడం, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎపిసోడ్, ఫైట్ సీన్స్ హీరో పాత్రకి గట్టి ఎలివేషన్ ఇచ్చి ప్రేక్షకులను ఎమోషనల్ గా సినిమాతో పాటే జర్నీ చేసేలా చేశాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలను చిత్రీకరించిన తీరు, ఫైట్స్, కొరటాల శివ రాసిన అర్థవంతమైన డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నాయి.

  మైనస్ పాయింట్స్ :
            సినిమా మొదటి అర్ధభాగం హీరో పరిచయం, లవ్ ట్రాక్, కథలో కీలకమైన ముఖ్యమంత్రి పాత్రలోకి మహేష్ ప్రవేశించడం, ఉత్కంఠకు గురిచేసే రాజకీయపరమైన సన్నివేశాలు, మంచి పాటలతో అలరించగా ద్వితియార్ధం కొద్దిగా నెమ్మదించింది. కథానాయకుడి పాత్ర కష్టాల్లో పడిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కొంత బలహీనంగా అనిపిస్తాయి. ద్వితియార్థం రన్ టైమ్ కొద్దిగా ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. క్లైమాక్స్ ఆమోదయోగ్యమైనదే అయినా ఊహించినంత భీభత్సంగా లేకుండా సింపుల్ గా ఉండటం కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది.
   
   
  Be the first one to comment. Click here to post comment!