• vijay opticals
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • కణం సినిమా రివ్యూ (27/4/18)

  Posted on 27 Apr, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (27/4/18.. 04.30pm)
              సాయి పల్లవి, నాగ శౌర్యలు జంటగా నటించిన చిత్రం ‘కణం’. ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత శుక్రవారం విడుదలైంది.  

  కథ:
            తులసి (సాయి పల్లవి), కృష్ణ (నాగ శార్య)లు 19 ఏళ్ల వయసులోనే తొందరపడతారు. ఆ తొందరపాటు మూలంగా తులసి గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ పెద్దలు బలవంతంగా తులసికి అబార్షన్ చేయిస్తారు. అబార్షన్ జరిగిన ఐదేళ్లకు అబార్షన్ కారణంగా తులసి కడుపులోనే మరణించిన బిడ్డ ఆత్మ రూపంలో వచ్చి తులసి కుటుంబ సభ్యులపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ బిడ్డ ఆత్మ ఎవరెవరిపై, ఎలా కక్ష సాధించింది అనేదే ఈ సినిమా కథ.

  ప్లస్ పాయింట్స్ :
          సినిమాలో బాగా ఆకట్టుకునే అంశం తల్లి, బిడ్డల ఎమోషన్. అబార్షన్ మూలాన కడుపులోనే చనిపోయిన బిడ్డ తల్లి మీద ప్రేమతో ఆమెను చూడాలని ఆత్మ రూపంలో వెనక్కి రావడం, తల్లి చుట్టూ తిరగడం, ఆ తల్లి కూడ ప్రపంచాన్ని చూడకుండా కన్నుమూసిన తన బిడ్డను ఊహించుకుంటూ ఆ బిడ్డకు దియా అని పేరు పెట్టుకోడం వంటి భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు విజయ్ ఈ సినిమా ద్వారా పెద్దలు చేసిన తప్పులకు శిశువుల్ని పుట్టకుండానే చంపడం ఎంతటి అనైతికం, ఏ స్థాయి దారుణం అనే విషయాల్ని వివరించారు. సినిమా రన్ టైమ్ కూడ తక్కువ కావడంతో సినిమా కథ చిన్న పాయింటే అయినా ఎక్కడా సాగదీసిన ఫీలింగ్ కలుగలేదు. ఫస్టాఫ్లో బిడ్డ ఆత్మ పెద్దలపై పగ తీర్చుకునే కొన్ని సీన్స్, ఆ ఆత్మకు, తల్లికి మధ్యన నడిచే కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాలు, అస్సలు ఊహించని రీతిలో ఉండే ఎమోషనల్ క్లైమాక్స్ మంచి అనుభూతినివ్వగా సాయి పల్లవి, పాప దియా పాత్ర చేసిన బేబీ వెరోనికా అరోరా నటన ఆకట్టుకున్నాయి.

  మైనస్ పాయింట్స్ :
             సినిమా కథ వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద చూపడాని సరిపడినంత కథనాన్ని విజయ్ తయారుచేసుకోలేదు. ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా అన్ని సన్నివేశాల్ని ముందుగానే ఊహించేయవచ్చు. ఫస్టాఫ్లో ఆత్మగా మారిన పాప పగ తీర్చుకోనే సన్నివేశాలు కొన్ని బాగానే ఉన్నా మిగిలినవి రొటీన్ అనిపించాయి. సినిమాలో సాధారణ ప్రేక్షకుల్ని అలరించే కమర్షియల్ అంశాలేవీ పెద్దగా లేవు. ఎక్కడా గ్లామర్ కానీ, కామెడీ కానీ మచ్చుకు కూడ తగలవు. కథనం సీరియస్ గా నడుస్తుంది అనుకునే సమయంలో మధ్యలో హాస్యం కోసం ఇరికించిన చేసిన ప్రియదర్శన్ పోలీస్ పాత్ర కొంత చికాకు పెడుతుంది. ఆయనపై వచ్చే కొన్ని సీన్స్ కూడ అనవసరం అనిపిస్తాయి. ఆ పాత్రను కామెడీగా కాకుండా కూడ సీరియస్ గా మలచి ఉంటే కథనం మరింత ఆసక్తికరంగా ఉండేది. 
   
   
  Be the first one to comment. Click here to post comment!