• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • ఆచారి అమెరికా యాత్ర సినిమా రివ్యూ (27/4/18)

    Posted on 27 Apr, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (27/4/18.. 04.30pm)
                  మంచు విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. విష్ణు సరసన ప్రగ్య జైస్వాల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చింది.  

    కథ :
           ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అమెరికా నుండి ఇండియా వచ్చిన రేణుక (ప్రగ్య జైస్వాల్)ను ఆమె ఇంటికి హోమం చేయించడానికి వచ్చిన పూజారి కృష్ణమాచారి (మంచు విష్ణు) ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకునే సమయానికి రేణుక చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతుంది. ఆమె కోసం కృష్ణమాచారి తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం)కి మాయ మాటలు చెప్పి అందరినీ అమెరికా తీసుకెళతాడు. అక్కడ తన ప్రేమను దక్కించుకోవడం కోసం కృష్ణమాచారి ఏం చేశాడు, అతని వలన అప్పలాచారి ఎలాంటి ఇబ్బందులుపడ్డాడు, అసలు కృష్ణమాచారి, రేణుకల ప్రేమకు అడ్డుపడింది ఎవరు అనేదే ఈ సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
            సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ బ్రహ్మానందం, మంచు విష్ణుల కామెడీ ట్రాక్. బ్రాహ్మణుల గెటప్లో లుక్స్ తోనే ఇంప్రెస్ చేసిన వీరిద్దరూ సినిమాలో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. పెళ్లికాని పురోహితుడిగా బ్రహ్మాంనందం ట్రాక్ బాగా పండింది. అలాగే అమెరికా వెళ్ళాక శిష్యుడు చేసే తప్పులకు భయపడుతూ, ఎరక్కపోయి ఇరుక్కుపోయిన గురువు పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల నవ్వులు పూయించింది. విష్ణు కూడ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. కథలో ముఖ్యమైన తాత, మనవరాళ్ల సెంటిమెంట్ ట్రాక్ ఎమోషనల్ గా కొంత వర్కవుట్ అయ్యింది. తాత పాత్రలో కోటా శ్రీనివాసరావుగారు మెప్పించారు. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ కొంత పర్వాలేదనిపించాడు.

    మైనస్ పాయింట్స్ :
            దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సింపుల్ కథను తీసుకున్న ఆయన బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, పృథ్వి వంటి స్టార్ కామెడియన్లను పూర్తిస్థాయిలో వాడుకోలేక పోయారు. కొద్దో గొప్పో బ్రహ్మానందం మినహా మిగతా వారంతా చాలా చోట్ల వృధాగానే కనిపించారు. ఆఖరి అరగంటలో వచ్చే పృథ్వి కామెడీ ట్రాక్ చికాకు పుట్టిస్తుంది.చాలా నార్మల్ గా మొదలైన సినిమా ఒకటి రెండు చోట్ల మినహా మరెక్కడా కూడ వేగం అందుకోదు. భిన్నమైన కథనం లేకపోవడం, కాలం చెల్లిన కామెడీ ట్రాక్స్ వలన సినిమా ఆద్యంతం బోర్ కొట్టించేసింది. తాత, మనవరాళ్ల ఎమోషనల్ ట్రాక్ మినహా సినిమాలో మరే అంశం కూడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని సన్నివేశాలైతే మరీ బలవంతంగా ఇరికించినట్టు తోచాయి. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి కమెడియన్లనే కాక ఠాకూర్ అనూప్ సింగ్ వంటి ప్రతినాయకుడ్ని కూడ సక్రమంగా ఉపయోగించుకోలేక సినిమాను చప్పగా తయారుచేశారు. చాలా సన్నివేశాలు ఎలాంటి హోమ్ వర్క్ లేకుండా అప్పటికప్పుడు రాసుకుని చిత్రీకరించినట్టే ఉన్నాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!