• Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • నా పేరు సూర్య సినిమా రివ్యూ (4/5/18)

  Posted on 04 May, 2018 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (04/05/18.. 04.30pm)
                 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఆరంభం నుండి భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.  

  కథ:
            ఎప్పటికైనా బోర్డర్ కి వెళ్లి దేశం కోసం యుద్ధం చేస్తూ చనిపోవాలనే బలమైన ఆశయం కలిగిన సోల్జర్ సూర్య (అల్లు అర్జున్) తనకున్న అతి కోపం, ఆవేశం కారణంగా ఆర్మీ నుండి బయటకు పంపివేయబడతాడు. తిరిగి ఆర్మీలోకి రావాలన్నా, బోర్డర్ కి వెళ్లాలన్నా ఇండియా లోనే ప్రముఖ సైకియాటిస్ట్ రామకృష్ణంరాజు (అర్జున్) పర్యవేక్షణలోఉండి, అతనిచేత అన్ని విధాల ఫిట్ గా ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకురమ్మని చీఫ్ సూర్యని ఆదేశిస్తాడు. సర్టిఫికెట్ కోసం రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య తన ప్రవర్తనను ఎలా మార్చుకున్నాడు, తండ్రి కొడుకులైన రామకృష్ణంరాజు, సూర్యల గత అనుభంధం ఎలాంటిది, చివరికి అందరికీ నచ్చినట్టు తనని తాను మార్చుకున్న సూర్య జీవితంలో ఏం కోల్పొతాడు అనేదే ఈ సినిమా.

  ప్లస్ పాయింట్స్ :
          కథానాయకుడు సూర్య పాత్ర. ఈ పాత్రను రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ మలచిన తీరు చాలా బాగుంది. కోపం, బలం, దేశభక్తి, ప్రేమ వంటి లక్షణాలు కలగలసిన సూర్య పాత్ర స్క్రీన్ మీద కనబడు తున్నంతసేపు చూసే వాళ్ళలో ఒక రకమైన కసి మైంటైన్ అవుతూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు మరొక ఎత్తని చెప్పాలి. నటనలో ఆయన చూపించిన తీవ్రత సోల్జర్ సూర్య పాత్రను చాలా కాలంపాటు గుర్తుండిపోయేలా చేసింది. మాట్లాడే విధానం, నడక, డ్రెస్సింగ్ సెన్స్, రొమాన్స్, కీలమైన ఎమోషనల్ సన్నివేశాలు అన్నింటిలో కొత్త బన్నీ కనిపిస్తాడు. వక్కంతం వంశీ గతంలో రాసిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ చిత్రాల్లాగానే ఈ సినిమా కథనాన్ని ఫస్టాఫ్ వరకు చాలా రేసీగా రాసుకున్నారు. కథలో నిగూఢంగా దేశానికి శత్రువులు ఎక్కడో తయారవ్వరు మన దేశంలో మనం చేసే తప్పుల వలనే తయారవుతారు, వ్యక్తిత్వాన్ని వదిలేస్తే ప్రాణాలు వదిలేసినట్టే వంటి సున్నితమైన అంశాలను బాగానే చెప్పారు. చిత్రం ఆరంభం నుండి చివరి వరకు తరచూ వచ్చే యాక్షన్ సన్నివేశాలు మంచి థ్రిల్ ఇచ్చాయి. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో హీరో పాత్ర తనలోని మార్పు వలన తాను ఏం కోల్పోతున్నాడో రియలైజ్ అవడం బాగుంది. ఇక తన నుండి అందరూ ఆశించే డ్యాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న అల్లు అర్జున్ మంచి మంచి డాన్స్ మూమెంట్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు.

  మైనస్:
              ఫస్టాఫ్ వరకు కథను సూర్య పాత్రను హైలెట్ చేస్తూ బాగానే నడిపిన దర్శకుడు వక్కంతం వంశీ ద్వితీయార్థానికి వచ్చే సరికి చప్పబడిపోయారు. ద్వితీయార్థంలో మొదలయ్యే అసలు కథ చెప్పుకోడానికి, వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం ఉండాల్సినంత ప్రభావంతంగా లేదు. రెండు మూడు సన్నివేశాలు మినహా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇంటర్వెల్ సమయానికి హీరో తనని తాను మార్చుకుని, చివరికి తన లక్ష్యమైన ఇండియా సరిహద్దులకి ఎలా చేరుకుంటాడో చూడాలి అనే ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు సెకండాఫ్లో కథను పూర్తిగా వేరే ట్రాక్లోకి తీసుకెళ్లిపోయాడు. ఆయన తీసుకున్న ఆ టర్న్ మంచిదే అయినా ప్రేక్షకుడు ఇంప్రెస్ అయ్యే విధంగా దాని ప్రయాణం లేకపోవడంతో ద్వితీయార్థం దెబ్బతింది.
  ఎప్పుడైన ప్రేక్షకుడు బాగుంటుందని ఊహించిన దానికి భిన్నంగా వేరే కథనాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది ప్రేక్షకుడు బాగుంటుందని కోరుకున్న దానికంటే గొప్పగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలోనే దర్శకుడు వంశీ కొంత తడబబడ్డారు. పైగా ప్రతినాయకుడి పాత్రలో బలం లేకపోవడం, హీరోయిన్ పాత్ర కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ద్వితీయార్థాన్ని సాదా సీదాగా మిగిల్చేశాయి.
   
   
  Be the first one to comment. Click here to post comment!