• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • మహానటి సినిమా రివ్యూ (9/5/18)

    Posted on 09 May, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/5/18..    04.30pm)
                 తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘మహానటి’. మహానటి సావిత్రిగారి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది.  

    కథ:
           పల్లెటూరి నుండి మద్రాస్ చేరుకొని సామాన్యురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిస్సంకర సావిత్రి (కీర్తి సురేష్) తన అభినయంతో మహానటిగా, మంచి మనసుతో సావిత్రమ్మగా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారు, తన సహా నటుడు జెమినీ గణేశన్ (దుల్కర్ సల్మాన్) తో ఎలా ప్రేమలో పడ్డారు, అతనితో ఆమె ప్రేమ, వైవాహికి జీవితం ఎలా సాగింది, నమ్మిన వాళ్ళే మోసం చేస్తే మనసు చెదిరి మద్యానికి బానిసై జీవిత చరమాంకంలో ఆమె ఎలాంటి క్షోభను, కష్టాల్ని అనుభవించారు, చివరికి ఈ లోకం నుండి ఎలా నిష్క్రమించారు అనేదే ఈ సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
                  ఈ చిత్రంలో బలాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి. ఒక మహా వ్యక్తి జీవితాన్ని సినిమాగా ఎలా తీయాలి, ఎలా తీస్తే అది గొప్ప చిత్రంగా నిలుస్తుంది అనే విషయాల్ని పూసగుచ్చినట్టు ఈ సినిమాతో చూపించాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో సావిత్రి జీవితం గురించి అయన చూపించిన ప్రతి అంశం నిజమే. చిత్రాన్ని మధురవాణి (సమంత) అనే ఒక జర్నలిస్ట్ పరిశోధనలోంచి మొదలుపెట్టిన దర్శకుడు మెల్లగా ప్రేక్షకుల్ని సావిత్రి జీవితంలోకి తీసుకెళ్లిపోతాడు. సినిమా చూస్తున్నంతసేపు సావిత్రిని దగ్గర్నుండి గమనించినట్టే ఉంటుంది. సావిత్రి సినిమా, వ్యక్తిగతమైన జీవితాల్ని సమాంతరంగా నడుపుతూ ఒక జీవితం ఇంకో జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది, జెమినీ గణేశన్ తో ఆమె ప్రేమ ఎలా ఉండేది, మనసారా ప్రేమించిన జెమినీ గణేశన్ మధ్యలో సావిత్రిని ఎలా నిర్లక్ష్యం చేశాడు, నా అనుకున్న వాళ్లంతా ఆమెను ఎలా మోసం చేశారు, ఆ క్షోభను మర్చిపోవడానికి ఆమె మద్యానికి ఎంతలా బానిసయ్యారు వంటి విషయాల్ని ఎంతో భావోద్వేగ పూరితంగా వివరించారాయన. ఆమె నటిగా ఎదగడంలో కెవి రెడ్డి, కెవి చౌదరి, ఎల్వి  ప్రసాద్, చక్రపాణి లాంటి ప్రముఖుల పాత్ర ఎటువంటిదో కూడ సవివరంగా చూపారు. సినిమాలో మరొక అద్భుతం కీర్తి సురేష్ నటన. ఆమెను చూస్తున్నంతసేపు సావిత్రిగారే తెరమీద నటిస్తున్నారా అన్నంత గొప్పగా నటించారామె. వేష ధారణ, అభినయం, బాడీ లాంగ్వేజ్ వంటి ప్రతి అంశంలోనూ సావిత్రిని అనుకరిస్తూ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించారు. ద్వితీయార్థంలో మద్యానికి బానిసైన సావిత్రిపై నడిచే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన మనసును హత్తుకుంది. సావిత్రి బాల్యం, ఆమె సినిమాల్లోకి రావడం వంటి అంశాలతో ఫస్టాఫ్ గడిచి పోగా ద్వితీయార్థం మాత్రం సావిత్రి జీవితంలోని ఒడిదుకులతో ఆసక్తికరంగా నడుస్తూ ఆద్యంతం ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ కూడ జెమినీ గణేశన్ పాత్రలో చాలా సహజంగా నటించి మెప్పించగా జర్నలిస్ట్ పాత్రలో సమంత పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసింది.

    మైనస్ పాయింట్స్ :
                సినిమా మొదటి అర్థ భాగం రన్ టైమ్ కొంచెం ఎక్కువ కావడంతో సినిమా కొంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సావిత్రి కథను వివరించిన జర్నలిస్ట్ మధురవాణి ట్రాక్ ను కథనంలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడంతో ప్రధాన కథ యొక్క ఫ్లోకు కొంత ఆటంకం కలిగింది. సావిత్రి నటనా జీవితం ఎంత గొప్పగా ఉండేది, ఇతర నటీ నటులతో ఆమె సాన్నిహిత్యం ఎలాంటిది వంటి అంశాలని ఇంకాస్త వివరంగా చూపి ఉండాల్సింది. సావిత్రిగారి కథ తెలిసిన వాళ్లకి ఈ చిత్రం బాగా కనెక్టవుతుంది కానీ తెలియనివారికి చిత్రం ఒక మామూలు సినిమాలాగానే అనిపిస్తుంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!