• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ఈనెల 20 నుంచి భీమవరం నియోజకవర్గ మహానాడు .. పట్టణ టిడిపి (14/5/18)

    Posted on 14 May, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/5/18..    04.30pm)
                  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రజల్లోకి ప్రతి కార్యకర్త తీసుకెళ్లని, రానున్న ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషి చేయాలనీ ఎపి అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్, టిడిపి నాయకులు గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) అన్నారు. స్థానిక పట్టణ టిడిపి కార్యాలయంలో సోమవారం పట్టణ టిడిపి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ టిడిపి అధ్యక్షులు తోట బోగయ్య మాట్లాడుతూ ఈనెల 20న భీమవరం నియోజకవర్గ మహానాడు, 24న ఉండి మార్కెట్ యార్డ్ లో జిల్లా మహానాడు, 27,28,29వ తేదీల్లో విజయవాడ సిద్దార్ధ కళాశాలలో నిర్వహిస్తున్న మహానాడును నాయకులు విజయవంతం చేయాలనీ కోరారు. కార్యక్రమంలో మామిడిశెట్టి ప్రసాద్, ఉప్పులూరి చంద్రశేఖర్, కొండ్రు శ్రీనివాస్, పామర్తి వెంకట్రామయ్య, నరహరశెట్టి రూప, ధనరాజ్, గంటా త్రిమూర్తులు, పడమటి సోమేశ్వరరావు, కొండేటి సాయి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!