• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • ప్రతిభ చాటిన మున్సిపల్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేత (14/5/18)

    Posted on 14 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/5/18..    04.30pm)
                   ప్రతిభావంతులు ఎక్కడైనా గౌరవింపబడతాయని, ప్రతిభకు పట్టం కట్టడం మన భారతీయ సంస్కృతిని నరసాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు అన్నారు. భీమవరం మున్సిపల్ ఉన్న పాఠశాలలో 2017-18 విద్య సంవత్సరంలో పదో తరగతి పరీక్షలో 10/10, 9.8,9.0 గ్రేడ్స్ సాధించిన విద్యార్థులకు సోమవారం స్థానిక ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిల్ సహకారంతో అభినందన సభ, ప్రతిభ పురస్కారాలను అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డురాదని భీమవరం మున్సిపల్ పాఠశాల విద్యార్థులు నిరూపించారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ వచ్చే విద్యాసంత్సరం అన్ని మున్సిపల్ పాఠశాలలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, 6 ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం 10/10 సాధించిన 6గురు, 9.0 సాధించిన 47 మంది మొత్తం 53 మందికి ప్రతిభ పురస్కారాలతో పాటు నగదును అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణ రాజు, కౌన్సిలర్ భూపతిరాజు శ్రీనివాస వర్మ, గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, భూసారపు సత్యనారాయణ, మెంటే గోపి, వేలూరి సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!