• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • కళావేదిక నిర్మాణానికి కృషి .. తితిదే సభ్యుడు పద్మరాజు

    Posted on 15 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/5/18.. 8.30pm)
                 కళాకారులకు పుట్టినిల్లుగా భాసిలే భీమవరంలో నాటక ప్రదర్శనల కోసం శాశ్వత కళావేదిక నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడు రుద్రరాజు పద్మరాజు అన్నారు. డీఎన్నార్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో చైతన్యభారతి సంగీత, నృత్య, నాటక పరిషత్‌ 11వ వార్షిక జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా సోమవారం జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. డీఎన్నార్‌ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల కార్యదర్శి  సాగి విఠల్‌రాజు, యూత్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు చిలుకూరి నరసింహరాజు, డాక్టర్‌ వేగేశ్న రవికుమార్‌రాజు పాల్గొని మాట్లాడారు. పద్మరాజును పరిషత్‌ ప్రధాన కార్యదర్శి మంతెన రామకుమార్‌రాజు, అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్‌, సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాంజలి (హైదరాబాద్‌) వారి ‘కృష్ణబిలం’ నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం చైతన్య కళా స్రవంతి (ఉక్కునగర్‌) వారి ‘అజ్ఞాతవాసం’ నాటిక, ఉషోదయ కళానికేతన్‌ (కాట్రపాడు) వారి ‘బతుకు చిత్రం’ నాటికలు ప్రదర్శించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!