• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • అందరితో కలిసి ఉండే వారే క్షత్రియులు .. క్షత్రియ ప్రముఖులకు సత్కారం (14/5/18)

    Posted on 15 May, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/5/18.. 8.30pm)
                  సమాజంలో అందరితో కలసిమెలసి ఉండే వారే క్షత్రియులని నరసాపురం పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. భీమవరం క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ రంగంలో ఉన్నత పదవులు పొందిన క్షత్రియ నేతలకు సోమవారం రాత్రి సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. పూర్వం నుంచి దానగుణం, సేవాతత్పరత వంటి విషయంలో క్షత్రియులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. దాని వల్లే మిగిలిన వర్గాల వారు ఎప్పుడూ తమను గౌరవిస్తారని, దానిని కాపాడుకునేలా మనమంతా నడుచుకోవాలని సూచించారు. ఉండి శాసనసభ్యుడు వేటుకూరి వెంకటశివరామరాజు, సంఘ  ప్రముఖులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గోకరాజు రామరాజు, ఎంవీ సూర్యనారాయణరాజు, చిలుకూరి నర్సింహరాజు, గాదిరాజు సుబ్బరాజు తదితరులు మాట్లాడారు. క్షత్రియులు మొదటి నుంచి రాజకీయ, పారిశ్రామిక, విద్య, సామాజిక రంగాల్లో ఉన్నత గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. తితిదే పాలకవర్గంలో సంఘీయులకు ఎప్పుడూ తగిన గుర్తింపు లభిస్తూనే ఉందని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, మంతెన వెంకటసత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), తితిదే పాలకవర్గ సభ్యుడు రుద్దరాజు పద్మరాజు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ గాదిరాజు బాబు, నీటి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొత్తూరి రామాంజనేయరాజు తదితరులను ప్రముఖులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ రాజు, ఏఎస్‌ఆర్‌ సేవా సమితి కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణంరాజు, దాట్ల శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!