• vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • అపర భగిరధుడు సర్‌ ఆర్దర్‌ కాటన్‌ .. ఎఎంసి చైర్మన్ నాగేశ్వరరావు (15/5/18)

    Posted on 15 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/5/18.. 10.30am)
                   ధవేళేశ్వరం ఆనకట్ట నిర్మించి గోదావరి జిల్లాలను సస్యశ్యామలం అయ్యేందుకు కృషి చేసిన అపర భగిరధుడు సర్‌ ఆర్దర్‌ కాటన్‌ అని ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. సర్ద్ అర్ధర్ కాటన్ జయంతి వేడుకలను మంగళవారం పట్టణ ఎఎంసి  కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా సర్‌ ఆర్దర్‌ కాటన్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా ఎఎంసి చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నదీ జలాలు అస్తవ్యస్తంగా ఉండి, మన ప్రాంత రైతులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సర్ద్ అర్ధర్ కాటన్ సాగునీరు త్రాగు నీరు పుష్కలంగా అందిచారని  అన్నారు. కాటన్ స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో ఉప్పులూరి చంద్రశేఖర్, చెల్లబోయిన సుబ్బారావు, ముచ్చకర్ల సుబ్బారావు, మేక రామకృష్ణ, బండ్రెడ్డి వెంకన్న, ఎండి షాబు, చెరుకువాడ రంగసాయి, ఘంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!