• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 10.30am)
              కృష్ణా జిల్లా నందిగామ శివారు అన్నాసాగరం బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటోను ఎదురుగా లారీ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చందర్లపాడు మండలం కోపూరులో జరుగుతున్న దశదిన కర్మ కార్యక్రమానికి మాంసం, ఇతర వస్తువులు ఆటోలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నందిగామ ఆసుపత్రికి తరలించారు. నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!