• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • రెండోరోజుకు చేరుకున్న పోస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 04.30pm)
                కేంద్రప్రభుత్వం వెంటనే పోస్టల్ ఐడియాన్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కమలేష్ చంద్ర కమిటీ సిఫార్స్ లు అమలు చేయాలనీ పోస్టల్ ఉద్యోగుల సంఘాల జెఏసి దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా పోస్టల్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘం ఎపి సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ లెనిన్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అతి చేరువ సేవలు అందించేది పోస్టల్ శాఖా ఒక్కటేనని అన్నారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్స్ లు అమలు జరపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని అన్నారు. కార్మికుల సంఘటిత శక్తితో తమ సమస్యలు పోరాడి సాధించుకొందామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏఎస్ ప్రకాశరావు, బి నాగేశ్వరరావు, బి గురుమూర్తి, బీహెచ్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!