• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • అమ్మమ్మగారిల్లు సినిమా రివ్యూ (25/5/18)

    Posted on 25 May, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (25/5/18.. 04.30pm)
                   ఛలో’ సినిమా తరువాత నాగ శౌర్య నుండి  వస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    కథ :
              తూర్పు గోదావరి జిల్లాలో పీఠాపురం అనే ఊళ్ళో ఓ ఉమ్మడి కుటుంబం లో మొదలవుతుంది ఈ కథ . ఇంటికి పెద్ద కొడుకైన రవి బాబు (రావు రమేష్ )ఆస్థి పంచుకొని సిటీలో స్థిరపడాలి అనుకుంటాడు. అది ఇంట్లో ఎవరికీ నచ్చదు. ఎలాగైనా ఆస్థి పంచుకొని ఇంట్లో నుండి వెళ్లిపోవాలని కుటుంభ సభ్యులతో  గొడవ పడతాడు. ఇది చూసి తట్టుకోలేక రావు రమేష్ నాన్న(హీరో తాత) చనిపోతాడు. దానితో ఇంట్లో ఉన్న వాళ్లంతా తలో దారి చూసుకుంటారు .తరువాత ఇంట్లో ఒక్కతే ఉంటున్న హీరో గారి అమ్మమ్మ అందరిని మళ్లీ ఎలాగైనా కలపాలని కోరికతో ఉంటుంది. హీరో మరి వాళ్ల అమ్మమ్మగారి కోరికను ఎలా నెరవేర్చాడు అన్నదే మిగతా కథ.

    ప్లస్ పాయింట్స్ :
           ఈ చిత్రంలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించి. ఆయన తన నటన తో సినిమా మొత్తాన్ని తన భుజాల మీదనే వేసుకున్నారు. తనకు అలవాటైన పాత్ర లో మరోసారి చెలరేగిపోయి ఎమోషనల్ ట్రాక్ లో తీవ్రతను తీసుకొచ్చారు. కమెడియన్ షకలక శంకర్ సినిమా ప్రేక్షకులకు కొంత ఇబ్బంది కలిగిస్తోంది అన్నప్పుడల్లా తన కామెడీతో చాలా వరకు నవ్వించాడు. దర్శకుడు ఈ సినిమాతో డబ్బు కంటే మనుషులే ముఖ్యం అనే మెసేజ్ ను ప్రేక్షకులకు చేరవేసాడు. హీరో నాగ శౌర్య తన నటనలో మంచి పరిణితి కనబర్చగా హీరోయిన్ షామిలి కూడ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించింది.

    మైనస్ పాయింట్స్ :
                  ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మొదటగా దర్శకుడి గురించి మాట్లాడుకోవాలి. సుందర్ సూర్య రాసుకున్న కథలోనే బలం లేదు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. ఫస్టాఫ్ వరకు బాగానే నడిచిన సినిమా సెకండాఫ్ కు చేరే సరికి అసలు కనెక్ట్ కాని ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువై ఇబ్బందిపెట్టింది.
    సినిమాలోని డైలాగ్స్ బాగానే ఉన్నా అవి హీరో పాటర్ మీద పదే పదే రిపీట్ అవడంతో హీరో పాత్రలో కొత్తదనం లోపించింది. ద్వితీయార్థం కథనంలో అనవసరమైన సన్నివేశాలు తరచూ వస్తూ చికాకు కలిగించాయి. క్లైమాక్స్ ఎపిసోడ్లో కుటుంబం ఆడే చిన్నపాటి డ్రామా చూసేవారి సహనానికి పరీక్షలా పరిణమించింది.సినిమా ప్రారంభం అయిన పది నిమిషాల తరువాత సినిమా కథంతా తెలిసిపోవడం ప్రేక్షకుల ఊహకు తగ్గటే సినిమా సాగడం వలన సినిమా చూస్తున్నంత సేపు ఎలాంటి థ్రిల్ కలుగదు.
     
     
    Be the first one to comment. Click here to post comment!