• Jaithra Business Solutions
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • అభిమన్యుడు సినిమా రివ్యూ (01/6/18)

  Posted on 01 Jun, 2018 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (01/6/18.. 04.00pm)
              విశాల్, సమంతలు జంటగా నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం ‘అభిమన్యుడు’ పేరుతో శుక్రవారం విడుదలైంది.  

  కథ :
           ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్ కరుణాకర్ (విశాల్) తన కోపం కారణంగా ఆర్మీ నుండి సస్పెండ్ అయి యాంగర్ మేనేజ్మెంట్ టెస్ట్ కోసం సైకియాటిస్ట్ లత (సమంత)ను కలుస్తాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తరుణంలోనే తన చెల్లి పెళ్లి కోసం తీసుకున్న లోన్ తాలూకు డబ్బును అతని తండ్రి అకౌంట్ నుండి హ్యాకర్స్ కొట్టేస్తారు.  దాంతో ఆలోచనలో పడ్డ కరుణాకర్ ఆ డబ్బును ఎవరు దోచేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ పోగా తనలాగే కొన్ని వేలమంది ప్రజల డబ్బును వైట్ డెవిల్ (అర్జున్) వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా హ్యాక్ చేసి దొంగిలించాడని తెలుస్తుంది. వైట్ డెవిల్ గురించి తెలుసుకున్న విశాల్ అతన్ని ఎలా ఎదురుకున్నాడు, అతన్నుండి ప్రజల డబ్బును ఎలా వెనక్కు రాబట్టాడు అనేదే సినిమా.

  ప్లస్ పాయింట్స్ :
           దర్శకుడు మిత్రన్ ప్రస్తుతం సమాజానికి అతిపెద్ద ప్రమాదంగా పరిణమించిన సైబర్ క్రైమ్ ఆధారంగా రాసుకున్న కథ స్మార్ట్ ప్రపంచంలో పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారాపడి బ్రతికే మనుషుల్ని ఆలోచింప జేస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎంత విలువైనది దాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు, డిజిటల్ టెక్నాలజీలోని లొసుగు లేమిటి, మనకి తెలీకుండా మన జీవితాన్ని కొందరు వాళ్లకు కావాల్సిన విధంగా ఎలా మానిటర్ చేస్తున్నారు వంటి అంశాలను చాలా క్షుణ్ణంగా చెబుతూ వాటిని వివరించడానికి కథలో మిత్రన్ రూపొందించిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సైబర్ నేరస్తుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటన చాలా బాగుంది. ఆయన పాత్ర వలనే సినిమాలో తీవ్రత కనబడింది. ద్వితీయార్ధం లో అర్జున్, విశాల్ కు మధ్యన నడిచే ఇంటిలిజెంట్ వార్ తాలూకు సీన్లు కొన్ని ఆసక్తికరంగా సాగుతూ మంచి థ్రిల్ ఇచ్చాయి. విశాల్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేయగా సమంత తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించారు.

  మైనస్ పాయింట్స్ :
             దర్శకుడు కథనాన్ని హీరో పాత్ర మీద ఆరంభించిన తీరు బాగానే ఉన్నా ఆ పాత్రలో క్లారిటీ లోపించడం ఇబ్బందికరంగా అనిపించింది. మిత్రన్ కథానాయకుడి పాత్రను ఒక తరహాలో కాకుండా కాసేపు ఆవేశపరుడైన సైనికుడిగా, ఇంకాసేపు సామాన్యుడిలా, మరికాసేపు దేశం వదిలి వెళ్లిపోవాలనుకునే స్వార్థపరుడిగా పలు విధాలుగా మారుస్తూ నడపడంతో కథలో తీవ్రత లోపించింది. మొదటి అర్థ భాగం హీరో కుటుంబం మీదే ఎక్కువసేపు నడవడంతో కొంతసేపటికి నీరసం కలిగింది. హీరో ఫ్యామిలీ ద్వారా దర్శకుడు పండిద్దామనుకున్న ఎమోషన్ పెద్దగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్లో కూడా వచ్చే ఇలాంటి కొన్ని సీన్లు ఇబ్బందిపెట్టాయి. దర్శకుడు మిత్రన్ మంచి పాయింట్ ను మాటల రూపంలో చెప్పడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు కానీ సన్నివేశాల రూపంలో వివరించడంలో పూర్తిగా ప్రేక్షకుడ్ని సంతృప్తి పరచలేక పోయారు.
   
   
  Be the first one to comment. Click here to post comment!