• Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • రాజుగాడు సినిమా రివ్యూ (01/6/18)

  Posted on 01 Jun, 2018 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (01/6/18.. 04.00pm)
              యువ హీరో రాజ్ తరుణ్, అమీరా దస్తూర్ జంటగా నూతన దర్శకురాలు సంజన రెడ్డి రూపొందించిన చిత్రం ‘రాజుగాడు’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

  కథ:
           పుట్టినప్పటి నుండి తనకు తెలీకుండా తానే దొంగతనం చేసే అలావాటు క్లెప్టోమేనియా ఉన్న రాజు (రాజ్ తరుణ్) వరుస దొంగతనాలు చేస్తూ ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూ ఇంట్లో వాళ్లకు కూడ తలనొప్పులు తెస్తాడు. ఆ జబ్బు మూలాన ఒకసారి తన ప్రేమను కూడ కోల్పోతాడు రాజు. అలా క్లెప్టోమేనియా మూలాన కష్టాలు పడే రాజు తన్వి (అమైరా దస్తూర్)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా మెల్లగా అతన్ని ప్రేమిస్తుంది. రాజు మాత్రం తనకు దొంగతనాలు చేసే అలవాటుందని ఆమెకు చెప్పడు. అలా నిజం దాచడం మూలాన రాజు తన్వి, ఆమె కుటుంబం ముందు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేదే సినిమా.

  ప్లస్ పాయింట్స్ :
             హీరో పాత్రకు క్లెప్టోమేనియా అనే జబ్బును ఆపాదించి ఎంటర్టైన్మెంట్ పండిద్దామనుకున్న దర్శకురాలు సంజన రెడ్డి ఆలోచన బాగానే ఉంది. ఆ పాత్ర ద్వారా కొన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ దొరికింది కూడ. రాజ్ తరుణ్ కూడ దొంగతనాలు చేసే అలవాటున్న వెరైటీ పాత్రలో బాగానే నటించాడు. కమెడియన్ పృథ్వి చేసిన కామెడీ అక్కడక్కడా కొన్ని నవ్వుల్నీ పూయించగలిగింది. హీరో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ అనొచ్చు. ఎప్పటికప్పుడు కొడుకు వలన కష్టాల పాలయ్యే తండ్రిగా ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ ఫన్ ను అందించాయి. ద్వితీయార్థంలో హీరోయిన్ ఇంటికి వెళ్లిన రాజు తన దొంగతనం అలవాటు వలన ఇబ్బందుల్లో పడటం వంటి కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అమైరా దస్తూర్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంత అలరించింది.

  మైనస్ పాయింట్స్ :
             సినిమాలో ప్రధాన లోపం సరైన కథనం లేకపోవడమే. దొంతనం అలవాటును చేర్చి హీరో పాత్రను ఆసక్తికరంగా తయారుచేసిన సంజన రెడ్డిగారు దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకోవడంలో సఫలం కాలేకపోయారు. ఎక్కడిక్కడ సన్నివేశాలని కథనంలోకి బలవంతంగా ఇరికించడం మూలాన సినిమా ఫ్లో దెబ్బతింది. చిత్రం ఏ ఒక్క సందర్భంలో కూడ గట్టిగా ఒక 15 నిముషాలు చాలా బాగా నడిచిందని చెప్పే ఆస్కారం లేదు.

  హీరో పాత్రలోని లోపం ఆధారంగా గతంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ లాంటి సినిమాల్లో హీరో పాత్ర ప్రతి సందర్భంలోను ఎంటర్టైన్మెంట్ ను అందివ్వగలిగింది. కానీ ఈ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశలలోనే హీరో పాత్ర నవ్వించింది కానీ పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. సాధారణంగానే మొదలైన చిత్రం పోను పోను బోర్ కొట్టే విధంగా మారిపోయి నిరుత్సాహాన్ని కలిగించింది. సినిమా చివర్లో కొన్ని పాత సినిమాల్ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన కామెడీ నటుల ట్రాక్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా మారింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు ఆకట్టుకోలేకపోయాయి.
   
   
  Be the first one to comment. Click here to post comment!