• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • ఆఫీసర్ సినిమా రివ్యూ (01/6/18)

    Posted on 01 Jun, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (01/6/18.. 04.00pm)
                 శివ’ సినిమాతో నాగార్జునకు తిరుగులేని విజయాన్ని అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . చాలా రోజుల తరువాత నాగార్జున, వర్మల కలయికలో రూపొందిన చిత్రం ‘ఆఫీసర్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

    కథ :
            వరుస ఎంకౌంటర్ల నేపథ్యంలో ముంబై పోలీస్ ఆఫీసర్ నారాయణ పసారి ఫై కోర్టు విచారణకు సిట్ ను నియమిస్తుంది. ఈ సిట్ కు హెడ్ గా హైదరాబాద్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ శివాజీరావు (నాగార్జున )ను నియమిస్తుంది. పసారి ఒక చేత్తో మాఫియాను అంత మొందిస్తూనే మరో పక్క డబ్బుల కోసం కాంట్రాక్టు కిల్లింగ్ చేస్తుంటాడు. శివాజీరావు విచారణ చేప్పట్టిన తరువాత పసారిని అరెస్ట్ చేసినా సాక్ష్యాలు లేనందున ఆ కేసును కొట్టివేయడం జరుగుతుంది. తన అరెస్ట్ తో కలత చెందిన పసారి కంపనీ అనే మాఫియాను తయారు చేస్తాడు. ఈ కంపెనీని, పసారిని శివాజీ రావు ఎలా పట్టుకుంటాడు అనేదే మిగతా కథ.

    ప్లస్ పాయింట్స్ :
             నాగార్జున తన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశారాయన. సినిమాలో చాలా ఫిట్ గా కనిపిస్తూ నటుడిగా తన డ్యూటీ తాను సక్రమంగా చేసి అగ్రెసివ్ పోలీసాఫిసర్ పాత్రకు న్యాయం చేశారు. నాగార్జున కూతురిగా కనిపించిన బేబీ కావ్య చక్కగా నటించింది. ఆమెకు నాగార్జునకు మధ్యన నడిచే తండ్రి కూతుళ్ళ తాలూకు ఎమోషనల్ ట్రాక్ బాగుంది. సినిమా ఫస్టాఫ్ ను ముంబై పోలీస్ వ్యవస్థ బ్యాక్ డ్రాప్లో సెట్ చేసి, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో కొంత ఆసక్తికరంగా నడిపారు రామ్ గోపాల్ వర్మ.

    మైనస్ పాయింట్స్ :
            దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న లైన్ ఆసక్తిగా ఉన్నా దాన్ని ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ గా మలచలేకపోయారాయన. మొదటి భాగంలో కథను ఆసక్తిగా స్టార్ట్ చేసి రెండో భాగం మొత్తాన్ని తనకు తోచినట్టు తీసుకుంటూ వెళ్ళిపోయారు. డ్యూటీ నుండి తొలగింపబడిన విలన్ మళ్ళీ డ్యూటీలో చేరడం, హీరోను తన టీంలో సభ్యుడిగా చేసుకోవడం వంటి అంశాలను ఆకక్తికరంగా చూపిచలేకపోయారు. ముఖ్యంగా ఆర్జీవీ సినిమాల్లో ఉండే క్రైమ్ డ్రామా ఇందులో అస్సలు కనబడలేదు. సినిమాకు మరొక పెద్ద డ్రాబ్యాక్ ప్రతినాయకుడి పాత్ర. ఆ పాత్ర బలహీనంగా ఉండటమేగాక ఆందులో నటించిన నటుడు కూడ ఏ ఒక్క సన్నివేశంలోనూ నాగార్జునకు ధీటుగా నిలబడలేకపోయారు. ఆ పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటుడ్ని తీసుకుని ఉంటే బాగుండేది.  చివర్లో హీరో, విలన్ కి మధ్య ఫైట్ సీన్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో కథను తయారుచేసుకున్నప్పుడు మాఫియా ప్రభావం ప్రజల మీద ఎంత ఉంది లాంటి అంశాలను చూపెట్టాలి కానీ సినిమాలో అలాంటి తీవ్రమైన అంశాలేవీ కనబడవు.
     
     
    Be the first one to comment. Click here to post comment!