• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • జురాసిక్‌ వరల్డ్ ... వివిధ తేదీల్లో రిలీజ్ (02/06/18)

    Posted on 02 Jun, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (02/6/18.. 10.30am)
            జురాసిక్‌ వరల్డ్‌ ఫాలెన్‌ కింగ్‌ డమ్‌’ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 22న అమెరికాలో విడుదల కావడానికి ముందే జూన్‌ 6 న బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేషియా, కొరియా, ఫిలిప్పీన్స్‌‌లో  జూన్‌ 7న ఇండియా, క్రొయేషియా, హాంగ్‌కాంగ్‌, గ్రీస్‌, రష్యా, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, ఉక్రెయిన్‌లో జూన్‌ 8న యూకే‌, వియత్నాం, ఆస్ట్రియా, బల్గేరియాలో విడుదల కాబోతోంది.‌ ‘జురాసిక్‌ పార్క్‌’ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. 2015లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌ డమ్‌’. క్రిస్‌ ప్రాట్‌, బ్రేసీ డల్లాస్‌, వాంగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎ. బయోనా దర్శకుడు. ఈ సినిమా అమెరికాలో జూన్‌ 22న విడుదల కాబోతోంది. యూఎస్‌ లో సినిమా తొలి వారంలో 140-150 మిలియన్‌ డాలర్ల వరకు (దాదాపు రూ.1000 కోట్లు) వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ‘జురాసిక్‌ వరల్డ్‌’ తొలివారంలో 208 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని చూడటానికి సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి కేవలం అమెరికాలోనే తొలివారంలో రూ.1000 కోట్లకుపైగా రాబట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!