• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • విష్ణు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విద్యార్థికి ఎల్ అండ్ టి స్కాలర్ షిప్ (12/6/18)

    Posted on 12 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/6/18.. 04.30pm)
                    శ్రీవిష్ణు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి కె అశ్వని రెడ్డి ఎల్ అండ్ టి బిల్డ్ ఇండియా స్కాలర్ షిప్ సాధించాడని కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ దశిక సూర్యనారాయణ తెలిపారు. ఎల్ అండ్ టి బిల్డ్ ఇండియా స్కాలర్ షిప్ జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో 3500 మంది పాల్గొన్నారని, 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఐటిఐ మద్రాసులో మౌఖిక పరీక్ష నిర్వహించారని తెలిపారు. పరీక్షలో 102 మంది ఎంపికకాగా జిల్లా నుంచి తమ విద్యార్థి అశ్వని రెడ్డి ఎంపికైయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థిని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వివిఎస్ శర్మ, అధ్యాపకులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!