• vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • జియో ‘డబుల్’‌ డేటా ధమాకా!

    Posted on 12 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/18..  10.30am)
               టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు డబుల్‌ ధమాకా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఇస్తున్న జియో ఇప్పుడు అదనపు డేటాను ఇవ్వనుంది. రూ.149, రూ.399 రీఛార్జి చేసుకుంటే వచ్చే డేటాతో అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌ కింద ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.149, రూ.349, రూ.399, రూ.449తో రీఛార్జి చేసుకుంటే వారికి డైలీ డేటా 1.5తో పాటు అదనంగా మరో 1.5జీబీ డేటాను పొందనున్నారు. అంటే మొత్తం 3జీబీ డేటాను జియో అందిస్తోంది. 
             రూ.198, రూ.398, రూ.448, రూ.498 రీఛార్జి చేసుకుంటే ఇప్పటి వరకు రోజుకు 2జీబీ డేటాను మాత్రమే పొందగలుగుతున్నారు. ఇక మీదట 3.5జీబీ డేటాను పొందవచ్చు. ఇక రూ.299, రూ.509, రూ.799తో రీఛార్జి చేసుకుంటే వరుసగా రోజుకు 4.5జీబీ, 5.5జీబీ, 6.5జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. దీంతో పాటు జియో రూ.300కి పైగా రీఛార్జి చేసుకున్న వినియోగదారులకు వంద రూపాయలు డిస్కౌంట్‌ ప్రకటించింది. రూ.300కంటే తక్కువ రీఛార్జి చేసుకుంటే 20శాతం డిస్కౌంట్‌ను వినియోగదారులకు లభించనుంది. అయితే.. ఈ రీఛార్జిలు మై జియో యాప్‌, ఫోన్‌పే వ్యాలెట్‌ ద్వారా చేసుకుంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆఫర్లు నేటి నుంచి అమల్లోకి రాగా.. జూన్‌ 30 వరకు అందుబాటులో ఉంటాయి.   
     
     
    Be the first one to comment. Click here to post comment!