• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • ఇంజనీరింగ్ విద్యార్థికి రూ 10 వేలు ఆర్ధిక సహాయం (13/6/18)

    Posted on 13 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/1817.. 04.30pm)
                     భీమవరం ప్రాంతంలో దాతృత్వం ఎక్కువని, పేద విద్యార్థులకు చేయూతనిచ్చే దాతలు ఎంతోమంది ఉన్నారని డిఎన్నార్ కళాశాల మాజీ సభ్యులు యర్రా సూర్యారావు అన్నారు. చిరుపవన్ తేజం సేవాసమితి కార్యాలయ ప్రాంగణములో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇంజనీరింగ్ విద్యార్థికి రూ 10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న కె సందీప్ కు కారుమూరి జ్యుయలర్స్ రూ 5 వేలు, చిరుపవన్ తేజం ఉండపల్లి రమేష్ నాయుడు రూ 2 వేలు, యర్రా సూర్యారావు రూ 3 వేలు మొత్తం రూ 10 వేలు ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఉండపల్లి రమేష్ నాయుడు, పుప్పాల శేషు, డీకేవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!