• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • నిట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల! .. 15 నుంచి కౌన్సెలింగ్‌

    Posted on 14 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/18..   04.30pm)
                 దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 23 ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, మరో 23 జీఎఫ్‌టీఐల్లో సీట్ల భర్తీకి సంబంధించి జోసా (జాయింట్‌ సీట్‌  అలకేషన్‌ అథారిటి) ఇటీవల జేఈఈ కౌన్సెలింగ్‌ కాలపట్టిక విడుదల చేసింది. ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏ విద్యా సంస్థలో సీటు పొందాలనుకుంటు న్నారో తెలుపుతూ ముందుగానే ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్లును ఈ నెల 27న కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఏడు విడతల్లో ముగియనుంది. అనంతరం 28 నుంచి జులై 2 వరకూ సంబంధిత కేంద్రాలకు వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రక్రియ జులై 19కి పూర్తవుతుంది. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జోసా, ఇనిస్టిట్యూట్‌ రుసుం కింద రూ.26,500, ఓబీసీ, ఓపెన్‌ కేటగిరి విద్యార్థులు రూ.89వేలు చెల్లించాలి. ఇవికాకుండా వసతి గృహాల రుసుము అందరూ రూ.32వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.లక్షలోపు ఆదాయం గల విద్యార్థులకు ట్యూషన్‌ రుసుము తిరిగి చెల్లిస్తారు. అలాగే రూ.5 లక్షలలోపు ఆదాయం గల వారికి 2/3 వంతు చెల్లిస్తారు. గతంలో ఆరు విడతల్లోనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయేది. గతేడాది నుంచి ఏడో విడత కూడా నిర్వహిస్తున్నారు. ఫలితంగా లక్షలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు వచ్చాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!