• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • 3.7 సెకన్లలో 100 కి.మీ.ల వేగంతో .. గంటకు 322 కి.మీ.

    Posted on 14 Jun, 2018 in Business |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18..   09.30am)
               జాగ్వార్‌ ఎఫ్‌-టైప్‌ ఎస్‌వీఆర్‌ స్పోర్ట్స్‌ కారును దేశీయ విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా తెలిపింది. దీని ప్రారంభ ధరను రూ.2.65 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్‌, ఇండియా) నిర్ణయించారు. 5-లీటర్‌ సూపర్‌ఛార్జ్‌డ్‌ వీ8 ఇంజిన్‌తో ఈ కారును తయారు చేశారు. 3.7 సెకన్లలో 100 కి.మీ.ల వేగాన్ని అందుకోవడం, గంటకు 322 కి.మీ. గరిష్ఠ వేగం దీని ప్రత్యేకతలు. ‘ప్రత్యేక వాహన కార్యకలాపాల్లో భాగంగా ఎఫ్‌-టైప్‌ ఎస్‌వీఆర్‌ను జాగ్వార్‌ తొలిసారిగా రూపొందించింది. ఇంజినీరింగ్‌ విభాగం చేసిన విలువైన ఆలోచనలు ఈ కారులో గొప్పగా ప్రతిబింబిస్తాయ’ని జేఎల్‌ఆర్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) రోహిత్‌ సూరి తెలిపారు. ఈ స్పోర్ట్స్‌ కారుకు బుకింగ్‌లు మొదలుపెట్టామని కంపెనీ పేర్కొంది. కూపే, కన్వర్టబుల్‌ రకాల్లో జాగ్వార్‌ ఎఫ్‌-టైప్‌ ఎస్‌వీఆర్‌ అందుబాటులో ఉంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!