• Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • కంటెయినర్‌ దగ్ధం .. రూ.30 లక్షల విలువైన స్పాంజ్‌ బుగ్గిపాలు

    Posted on 14 Jun, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18..   10.30am)
               జాతీయ రహదారిపై కంటెయినర్‌లో మంటలు చెలరేగిన ఘటన వాహనదారుల్లో ఆందోళన కలిగించింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్‌ చౌరస్తా టోల్‌ప్లాజా వద్ద ఘటన జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బుధవారం భారీ కంటెయినర్‌లో స్పాంజ్‌ తరలిస్తున్నారు. అలంపూర్‌ చౌరస్తా టోల్‌ప్లాజా వద్ద వాహనం నిలిపి మూత్ర విసర్జన కోసం వెళ్లాడు. అప్పటికే వాహనం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు 101కు సమాచారం ఇచ్చారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ప్రయాణికులు పరుగులుపెట్టారు. ఎక్కడి వాహనలు అక్కడే నిలిచిపోయాయి. కర్నూలు అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. మంటలు డీజిల్‌ ట్యాంకు వరకు రాకుండా నిరోధించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో కంటెయినర్‌ లోని రూ.30 లక్షల విలువైన స్పాంజ్‌ బుగ్గిపాలైనట్టు సమాచారం.
     
     
    Be the first one to comment. Click here to post comment!