• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • పట్టణంలోని అభివృద్ధి నిర్మాణాలను పూర్తిచేయాలి (14/6/18)

    Posted on 14 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18.. 04.30pm)
                     పట్టణంలో నూతన ఔటర్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి, పార్కుల అభివృద్ధి, వ్యాయమ జిమ్, ఇండోర్ ఆడిటోరియంల నిర్మాణాలపై ఎంపీలు గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావులను కోరుతున్నామని టిడిపి పట్టణ అధ్యక్షులు  తోట బోగయ్య అన్నారు. గురువారం టీడీపీ  పట్టణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర మహానాడు హాజరుకాని ప్రతినిధుల వివరాలను రాష్ట్ర పార్టీకి నివేదిక రూపొందిస్తున్నామని అన్నారు. సమావేశంలో మద్దుల రాము, సట్టివాడ హరి, ఎండి షబీనాబేగం, ఉప్పలపాటి లక్ష్మి, ఎస్ నసీమాబేగం, నాగ భూషణం, కె శ్రీనివాస్, పడమటి సోమేశ్వరరావు, శేషారావు, కనకదుర్గ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!