• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • శ్రీమావుళ్ళమ్మ జ్యేష్ఠమాస జాతర ప్రారంభం (14/6/18)

    Posted on 14 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18.. 04.30pm)
                భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాన్ని గురువారం ప్రారంభించారు. గురువారం సాయంత్రం 5.35 నిమిషాలకు అమ్మవారిని నిలబెట్టారు. వచ్చేనెల 9వ తేదీ వరకు అమ్మవారిని గ్రామంలో తిరుగుట, 24న గవాళ్ళ గడుపు సేవ, 1న అమ్మవారికి చలిమర్లు దేవస్థానం వారిచే రాత్రిసేవ, 5న అమ్మవారి దేవస్థానం ఆర్ధిక సహాయంతో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ వారిచే "అమ్మవారి నగరోత్సవం" నిర్వహిస్తామని ఆలయ ఈవో నల్లం చక్రధరరావు తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అమ్మవారి నగరోత్సవాన్ని ప్రారంభిస్తారని, 9న ఉదయం 6.20 నిమిషాలకు అమ్మవారి గరగల ఉయ్యాల సేవ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, మెంటే, అల్లూరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!