• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • ఐఫా కోసం 80 కిలోల గౌను ధరించిన ఊర్వశి రౌతెలా

    Posted on 27 Jun, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (27/6/18.. 10.00am)
              ఏవన్నా ఈవెంట్లు జరిగితే నటీనటులు ఎలాంటి దుస్తుల్లో వస్తారని అక్కడి ప్రేక్షకులతో పాటు మీడియా వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఐఫా కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు మెరిశారు. నటీమణులు ఎంతో అందంగా ముస్తాబై కెమెరాలకు పోజులిచ్చారు. వారందరిలో అందరి దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా. ఎందుకంటే ఊర్వశి అందమైన ఆఫ్‌ వైట్‌ గౌనులో హోయ లొలికించారు. అదీకాకుండా ఆ గౌను బరువు ఏకంగా 80 కిలోలట. ఈ విషయం ఊర్వశి వెల్లడించే వరకు అక్కడి వారికి కూడా తెలీదు. ఆ గౌను అంత బరువు ఉన్నప్పటికీ ఆమె ఎలాంటి కంగారు, భయం లేకుండా సింపుల్‌ గా మోయగలిగారు. దీనిని ప్రముఖ డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ డిజైన్‌ చేశారు. 2015లో మిస్‌ ఇండియా దీవాగా కిరీటం దక్కించుకున్న ఊర్వశి..‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘సనమ్‌ రే’, ‘హేట్‌ స్టోరీ 4’ వంటి చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!