• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • శంభో శంక‌ర‌ సినిమా రివ్యూ (29/6/18)

    Posted on 29 Jun, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/6/18.. 04.30pm)
          హాస్యనటుడిగా అందరికీ సుపరిచితమైన శంకర్ హీరోగా టర్న్ తీసుకుని చేసిన చిత్రం ‘శంభో శంకర’. ఎన్. శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.  

    కథ:
            కరువుతో అల్లాడుతున్న అంకాలమ్మ పల్లెను ఆ ఊరి ప్రెసిడెంట్ (అజయ్ ఘోష్) అక్రమాలు చేస్తూ ఇంకా దోచుకుతింటుంటాడు. అదే ఊర్లో ఉండే శంకర్ (శంకర్) అనే కుర్రాడు అప్పుడప్పుడు ప్రెసిడెంట్ చేసే అక్రమాలకు అడ్డుపడుతుంటాడు. దాంతో ప్రెసిడెంట్ అతన్ని అడ్డు తొలగించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని శంకర్ ఎలా తన ఊరిని కాపాడాడు, రైతుల కష్టాల్ని ఎలా తీర్చాడు అనేదే సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
                   సినిమాలో బాగా అలరించిన అంశం ఏదైనా ఉందా అంటే అది శంకర్ అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు హాస్యనటుడిగా కనిపించిన శంకర్ ను ఒక్కసారిగా హీరోగా చూడటం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. బరువు తగ్గి, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న ఆయన తన పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. పెద్ద పెద్ద డైలాగులను చెబుతూ, మంచి డ్యాన్సులు, ఫైట్స్ చేస్తూ సహజమైన నటనను కనబర్చి తనలో కథను నడపగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. తన ట్రేడ్ మార్క్ అయిన శ్రీకాకుళంలో యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు.
    దర్శకుడు ఎన్. శ్రీధర్ శంకర్ పాత్రను జాగ్రత్తగా డిజైన్ చేసి శంకర్ నుండి తనకు కావాల్సిన ఔట్ పుట్ రాబట్టుకోవడంలో సఫలమయ్యారు. ఫస్టాఫ్ లో ఆయన రాసిన కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను కూడ బాగుంది. చాలా చోట్ల శంకర్ లోని నటుడు బాగా ఎలివేట్ అయ్యాడు. హీరోయిన్ కారుణ్య చౌదరి, శంకర్ లకు కెమిస్ట్రీ బాగానే కుదిరింది. పాటలు చూడటానికి, వినడానికి కొంతమేర బాగున్నాయి.

    మైనస్ పాయింట్స్ :
             దర్శకుడు ఎన్.శ్రీధర్ కథలో శంకర్ పాత్రను బాగానే డిజైన్ చేసుకున్నారు కానీ కథనాన్ని సరిగ్గా రాసుకోలేకపోయారు. కొన్ని బోర్ కొట్టే అనవసరమైన సన్నివేశాలు ఉన్నా మొదటి అర్ధభాగం వరకు పర్వాలేదనిపించిన స్క్రీన్ ప్లే సెకండాఫ్ కు వచ్చే సరికి పూర్తిగా రొటీన్ అయిపొయింది. ఎన్నో పాత సినిమాల్లో చూసిన మలుపులు, సన్నివేశాలే ఇందులోనూ దర్శనమిచ్చాయి. హీరో ఊరికి దేవుడిగా మారే సన్నివేశాలు కొంత విపరీతంగాను, సిల్లీగాను ఉండటం, శంకర్ నటన కూడ అదుపుతప్పి కావాల్సిన స్థాయిని మించిపోవడంతో ద్వితీయార్థం బోర్ కొట్టింది. అంతేగాక హీరో తన కొడుకుని చంపినా ప్రతి నాయకుడిలో పెద్దగా చలనం కనబడకపోవడం, ఒక్కసారిగా పరిస్థితులన్నీ హీరోకు అనుకూలంగా మారిపోవడం, కీలక సన్నివేశాలు కొనసాగింపు లేకుండా చక చకా ముగిసిపోవడం వలన సినిమా మరీ నాటకీయంగా మారిపోయింది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!