• Category Banner Ad
 • vijay opticals
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • ఈ నగరానికి ఏమైంది సినిమా రివ్యూ (29/6/18)

  Posted on 29 Jun, 2018 in Cinema |   0 Comments
   

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/6/18.. 04.30pm)
           పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది ?’. మంచి బజ్ నడుమ ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.   

  కథ:
           వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు నలుగురు మంచి స్నేహితులు. వీరిలో వివేక్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని లవ్ బ్రేకప్ అవ్వడంతో అతను డిప్రషన్ లోకి వెళ్లి నలుగురి మధ్య కొంత దూరం పెరుగుతుంది. అలాంటి సమయంలో ఆ నలుగురిలో ఒకరైన కార్తిక్ కు పెళ్లి కుదరడంతో అందరూ బార్లో కలిసి మందు తాగుతారు. ఆ మత్తులోనే గోవా వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్లిన ఆ నలుగురి జర్నీ ఎలా సాగింది, అసలైన జీవితానికి వాళ్ళు తెలుసుకున్న అర్థం ఏమిటి అనేదే తెరపై నడిచే సినిమా.

  ప్లస్ పాయింట్స్ :
          దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన రైటింగ్ పవర్ చూపించారు. సాధారణమైన స్టోరీ లైన్ ను తీసుకున్న ఆయన అందులో కొన్నాళ్ళ పాటు గుర్తుండిపోయే నాలుగు పాత్రల్ని రాసి, వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో ఫన్నీ కథనాన్ని అల్లుకున్నారు. దీంతో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ప్రధాన పాత్రలు, వాటి మాటలు చాలా సహజంగా ఉండటంతో ప్రేక్షకులు చాలా త్వరగా వాటికి కనెక్టైపోతారు. ప్రధాన పాత్ర వివేక్, అతని స్నేహితుడు కౌశిక్ ల క్యారెక్టర్స్ ను చాలా బాగా డిజైన్ చేశారు తరుణ్ భాస్కర్. వివేక్ పాత్రలో సీరియస్ నెస్ తో కొంత బాధను కూడ మిక్స్ చేసి చూపిన దర్శకుడు కౌశిక్ పాత్రను మాత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీతో నింపేసి సినిమా మొత్తం ఎంటర్టైన్ చేశారు. ఆ పాత్రలో మంచి టైమింగ్ తో కూడిన అభినవ్ గోమఠం నటన చాలా ఇంప్రెస్ చేసింది. ఫస్టాఫ్ లో మొదలయ్యే అతని కామెడీ సెకండాఫ్ గోవా చేరుకొని సినిమా ముగిసే వరకు నవ్విస్తూ సరదాగా సాగిపోయింది. జీవితమంటే అసలైన అర్థం తెలుసుకోవడం అనే కాన్సెప్ట్, అందులో జీవితమంటే నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే అంటూ తరుణ్ భాస్కర్ చెప్పిన అర్థం మనసుని తాకాయి. ఇక మిగిలిన నటీ నటులు సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్ లు కూడా తమ నటనతో మెప్పించారు.

  మైనస్ పాయింట్స్ :
          కామెడీ పరంగా ఎలాంటి లోటు లేకుండా సినిమా ఇన్నర్ గా నడిచే ప్రధాన పాత్ర వివేక్ లవ్ స్టోరీ విషయంలో కొంత నెమ్మదిగా, బలహీనంగా అనిపించింది. వివేక్ ప్రేమలో పడటం, ప్రేయసితో అతని లవ్ జర్నీ, విడిపోవడం వంటి కీలకమైన అంశాలను సాదాసీదాగా చూపించారు తరుణ్ భాస్కర్.  ప్రథమార్థం కూడ కొంత సాగదీసిన ఫీలింగ్ కలిగింది. యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్లను కోరుకునే వారిని, కుటుంబ ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తిపరచలేదు. ఇక ప్రధాన పాత్ర వివేక్ అప్పటి వరకు ఉన్న డిప్రషన్ నుండి బయటకు రావడం, తిరిగి మామూలుగా సరదగా మారిపోవడం, దాని వెనుకున్న కారణాలు కొంత నాటకీయంగా అనిపించాయి.
   
   
  Be the first one to comment. Click here to post comment!