• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • సంజీవని సినిమా రివ్యూ (29/6/18)

    Posted on 29 Jun, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/6/18.. 04.30pm)
                ట్రైలర్ తో ప్రేక్షకుల్లో కొంత అటెంక్షన్ తెచ్చుకున్న చిత్రం ‘సంజీవని’. నూతన దర్శకుడు రవి వీడే డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.  

    కథ:
          భారత ప్రభుత్వం దుర్బేధ్యమైన పర్వత ప్రాంతంలో ఉన్న రహస్యాన్ని ఛేదించమని ఒక పర్వతారోహకులు బృందానికి చెబుతుంది. దాన్ని ఛాలెంజింగా తీసుకున్న బృందం ఆ పర్వతంలోని రహస్యాన్ని కనుగొనడానికి బయలుదేరుతుంది. అలా వెళ్లిన పర్వతారోహకుల ప్రయాణం ఎలా సాగింది. మార్గ మధ్యలో వారికి ఎలాంటి ఆపదలు ఏర్పడ్డాయి, చివరికి వారు పర్వతంలోని రహస్యాన్ని కనుగొన్నారా లేదా అనేదే తెరపై నడిచే సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
              సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ తక్కువగా ఉన్న రన్ టైమ్. సినిమా ఓపెనింగ్ సమయంలో వచ్చే హెలికాఫ్టర్ షాట్ చాలా బాగుంది. ఆ సన్నివేశాన్ని మంచి సీజీ వర్క్ తో రూపొందించారు. నూతన సాంకేతికతను వినియోగించి పర్వత ప్రాంతంలో తీసియాన్ డ్రోన్ షాట్స్ కొన్ని బాగున్నాయి. ప్రధాన తారాగణం పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటులందరూ కొత్తవారే. అందరూ ఓకే అనేలా పెర్ఫార్మ్ చేశారు. సినిమా ఆఖరులో బృందం రహస్యాన్ని ఛేదించడం, అక్కడే హనుమంతుడి విగ్రహం సహజంగా రూపొందడం, అందులోని విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

    మైనస్ పాయింట్స్ :
              సినిమా ఆరంభంలో భారీ అడ్వెంచరస్ షాట్ చూపించి ప్రేక్షకులు ఇకపై సినిమా మొత్తం ఇలానే భారీ గ్రాఫిక్స్ నిండి థ్రిల్లింగా ఉంటుంది అనుకునే సమయానికి సినిమా కాలేజ్ నేపథ్యంలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా నిరుత్సాహానికి గురిచేస్తుంది. హీరో హీరోయిన్ల నడుమన సాగే ఎమోషనల్ సీన్స్ అసహజంగా ఉన్నాయి. పర్వతారోహకులు బృందంలోని సభ్యుల్లో ఒకరికొకరు మధ్యన బాండింగ్ ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ప్రథమార్థం ఏదోలా గడిచిపోయింది అనుకునే లోపు సెకండాఫ్ రివెంజ్ డ్రామాగా మారిపోయి, సభ్యులు విడిపోవడం విస్మయానికి గురిచేస్తుంది. టీమ్ మెంబర్స్ కారణం లేకుండా ఒకరినొకరు చంపుకోవడమనే లాజిక్ లేని అంశం చిరాకు తెప్పిస్తుంది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!