• Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • vijay opticals
 • తేజ్ ఐ లవ్ యు సినిమా రివ్యూ (6/7/18)

  Posted on 06 Jul, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/7/18.. 04.30pm)
               సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై ఏ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మంచిన చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.  
  కథ:
             తేజ్ (సాయిధ‌ర‌మ్‌ తేజ్‌) ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలోని అబ్బాయి. కొన్ని కారణాల వల్ల అత‌ని పెద‌నాన్న తేజ్ ను కుటుంబం నుంచి వెలివేస్తాడు. దాంతో హైద‌రాబాద్‌ లోని తన బాబాయ్ (పృథ్వి) ఇంటికి వచ్చి తన ప్రెండ్స్ తో క‌లిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ క్రమంలో నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) చూసి ఇష్టపడతాడు. కానీ ఓ కారణంగా 15 రోజులు అగ్రిమెంట్ వల్ల ఆమె బాయ్ ఫ్రెండ్‌ గా ఆమె చెప్పిందల్లా చేయటానికి ఒప్పుకుంటాడు. మధ్య మధ్యలో న‌ందినిని మాత్రం ఎవరో ఫాలో చేస్తుంటారు. ఈ లోపు తేజు నందినితో ప్రేమలో పడి ఇద్దరు ఒక్కటయ్యే క్ర‌మంలో నందినికి యాక్సిడెంట్ అవ్వటం ఆమె గతంతో పాటు తేజుని కూడా మర్చిపోవటం జరుగుతుంది. తిరిగి నందినికి గతం గుర్తుకు వస్తుందా ? తన ప్రేమను బతికించుకోవడానికి తేజ్ ఏం చేశాడు ? అసలు న‌ందినిని ఫాలో చేస్తున్న వాళ్ళు ఎవ‌రు? చివరకి తేజ్ నందిని ఒకటయ్యారా ?.
  లాంటి విష‌యాలు తెలుసుకోవాలంటే ‘తేజ్‌’. ఐ లవ్‌ యు చిత్రం చూడాల్సిందే.

  ప్లస్ పాయింట్స్ :
         హీరో సాయి ధరమ్ తేజ్ ఎప్పటి లాగే తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు. అతని లుక్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్‌ కూడా ప్రతి ఫ్రేమ్ లోను అందంగా కనిపిస్తూ అలరించింది. హీరోని టార్చర్ చేసే సన్నివేశాల్లో తన క్యూట్ హావా భావాలతో ఆమె ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోకి పెద్దమ్మగా చేసిన పవిత్రా లోకేశ్‌ పాత్ర బాగుంది. మొదటి అర్ధభాగం కొంత సరదాగా నడవడానికి హీరోకి ఫ్రెండ్ గా చేసిన వైవా హర్ష సినిమాకి బాగానే ఉపయోగ పడ్డాడు. సినిమా బోర్ కొడుతుందన్నప్పుడల్లా హార్ష తన కామెడీ టైమింగ్ తో కొంత వరికి రిలీఫ్ ఇవ్వగలిగాడు. సాయి ధరమ్ తేజ్ తన ఈజ్ తో సినిమాని నిలపెట్టడానికి ఎంత ప్రయత్నించిన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

  మైనస్ పాయింట్స్ :
            గతం మర్చిపోయిన ప్రియురాలు తన ప్రియుడుని మళ్ళీ ఎలా కలుసుకుంది లాంటి మంచి పాయింట్ ఉన్నా, దర్శకుడు కరుణాకరన్‌ సరిగ్గా ఆ పాయింట్ ను వాడుకోలేకపోయాడు. కొంతవరకు ఆయన చెప్పాలనుకున్న ప్రేమకథ బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రేక్షకుడ్ని పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే విధంగా తెరకెక్కించలేకపోయారు. మొదటి అర్ధభాగాన్ని పాత్రలను, వాటి స్వభావాల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, హీరోహీరోయిన్లు కలుసుకోవటానికే ఖర్చు పెట్టేసిన దర్శకుడు సన్నివేశాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ ప్రేమ కథలో హీరో హీరోయిన్ల మధ్యన బలమైన ప్రేమ ఉన్నా, ప్రేక్షకుడి మనసుకు మాత్రం అంత బలంగా ఆ ప్రేమ తాకలేకపోయింది. గతం మర్చిపోయే హీరోయిన్ పాత్ర వల్ల కథకు కావాల్సినంత కాన్ ఫిల్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బలంగా సీన్లు మాత్రం ఉండవు. హీరో పాత్రను కూడా ఫేక్ ఎమోషన్ తో నింపేసి దర్శకుడు కథను బాగా సాగతీశాడు. ఇక ముగింపు సన్నివేశాలు కూడా సహజత్వానికి దూరంగా చాలా నాటకీయంగా రొటీన్ గా అనిపిస్తాయి. 
   
   
  Be the first one to comment. Click here to post comment!