• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • పోల్ టాక్స్ ను రద్దు చేయాలనీ కోరుతూ కేబుల్ ఆపరేటర్ల ధర్నా (10/7/18)

    Posted on 10 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/7/18..   4.30pm) 
                 AP MSO & CABLE OPERETARS WELFARE ASSOCIATION రాష్ట్ర సంఘం పిలుపు మేరకు భీమవరం పట్టణ, మండల కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వ G.O.15 ప్రకారం పట్టణాలలో నెలకి రూ.50, గ్రామాల్లో 35 చొప్పు ఆ పోల్ టాక్స్ విధించిన సందర్భంలో దానిని రద్దు పరచాలని కోరుతూ భీమవరం మండల తహసీల్దార్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ వినతిపత్రం సమర్పించారు.  నాయకులు మాట్లాడుతూ అసలే టెక్నికల్ గా వచ్చిన మార్పుకు, GST , పే చానల్స్ రేట్లు పెరిగి కేబుల్ సర్వీస్ చేయడంలో ఆపరేటర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరల పన్నులు విధించి పరోక్షంగా వినియోగదార్లకు నెలసరి రేట్లు పెరిగేలా ప్రభుత్వ తీసుకొన్న చర్యను వెనక్కి తీసుకోవాలని అన్నారు.  స్వయం ఉపాధి ద్వారా కేబుల్ సర్వీస్ చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్న వేల ఆపరేటర్ల పరిస్థితిపై ప్రభుత్వ తగు రీతిలో ఆదుకోవాలని కోరారు.  కార్యక్రమంలో వెంకటరత్నం, కోటేశ్వరరావు, సుధీర్,  రామారావు, మెహర్ మాణిక్యం, సుబ్బారాయుడు, శ్యామ్, రమణ, బొక్క శ్రీను, బోణం శ్రీను తదితర పట్టణ, గ్రామ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!