• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • విద్యార్ధులపై లాఠీచార్జి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ (11/7/18)

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18..   04.30pm)
              బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ నరసాపురం డిపోలో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలియజేస్తున్నా వారిపై దాడిచేసిన నరసాపురం టౌన్ ఎస్సై చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి ఎం శివరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా భీమవరం ప్రకాశం చౌక్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలియజేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా శివరాజు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బస్సు ఆ ప్రాంతంలో బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులు స్పందించక పోవడం దారుణమని అన్నారు. విద్యార్ధులపై అమానుషంగా లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంగా నిరసన చేసిన వారిపై దాడి చేసిన ఎస్సైపై ఉన్నత అధికారులకు పిర్యాదు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏ మణికంఠ, ప్రిన్సి బాబు, ఏ కార్తీక్, పెద్దిరాజు,తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!