• Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • నీ కొడుక్కేనా జాబ్ .. మాకేదీ ఉద్యోగం అంటూ డివైఎఫ్ఐ ధర్నా, మానవహారం (11/7/18)

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18..   04.30pm)  
             బాబు జాబు నీ కొడుక్కేనా మాకేదీ ఉద్యోగం అంటూ నిరుద్యోగులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం ప్రకాశం చౌక్ లో మానవహారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అల్లూరి అరుణ్ మాట్లాడుతూ బాబు వస్తే జబ వస్తుందని ప్రచారం చేసి గెలిచినా చంద్రబాబు తన కొడుక్కి ఇచ్చాడు తప్ప నిరుద్యోగులకు ఇవ్వలేదని అన్నారు.   4 ఏళ్ళు పూర్తివుతున్న డిఎస్సి నిర్వహించక పోవడం శోచనీయమని  అన్నారు. క్యాబినెట్ ద్వారా 77 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. డిఎస్సి పోస్టులను 20 వేలకు పెంచాలని, నిరుద్యోగ భృతి రూ 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం శివరాజు, కార్తీక్, జయరాజు, శివకుమార్, రాంశ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 
                 
     
     
    Be the first one to comment. Click here to post comment!