• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • భీమవరంలో "అన్న క్యాంటీన్" ప్రారంభం (11/7/18)

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18..   04.30pm)  
              పేదలకు చౌక ధరలకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బుధవారం మార్కెట్ లో  "అన్న క్యాంటీన్" ను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తొలి విడతగా 60 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. రూ.5 లకు అల్పాహారం, భోజనం అందించే అన్న క్యాంటీన్‌ను అందిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్ల అందుబాటులోకి తీసుకురానున్నారని అన్నారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని ప్రభుత్వం రూ.15కే అందిస్తోందని, క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారని అన్నారు. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250 -300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారని, అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మందికి ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం క్యాంటీన్‌ నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణ రాజు, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, తోట బోగయ్య, కౌన్సిలర్లు ఎండి నౌషాద్, అభిరుచి రఘు, బర్రె నెహ్రు, చెన్ను శాంతి, విజ్జురోతి రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!