• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • నవంబరు 14న శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18..   09.30am)
                    రైల్వే శాఖ యాత్రికుల కోసం శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌ను నడపనుంది. నవంబరు 14 నుంచి ప్రారంభం కానున్న ఈ రైలు రామాయణ ఇతిహాస ముఖ్యప్రాంతాలను చుట్టివస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 800 సీట్లున్న ఈ రైలు దిల్లీలోని సఫ్దర్‌ జంగ్ ప్రాంతం నుంచి మొదలై 16 రోజుల్లో తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్‌ రైల్ టూరిజం, క్యాటరింగ్ కార్పొరేషన్‌ దీన్ని నడపనుంది. ‘పురాణ పురుషుడైన రాముడి జీవితంతో ముడిపడిన అన్నిప్రాంతాలను ఈ రైలు చుట్టివస్తుంది. దీనికింద 16 రోజుల టూర్ ప్యాకేజ్‌ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్యాకేజ్‌లో భోజన సదుపాయం, వసతి సౌకర్యం, ఇతర పర్యాటక ప్రదేశాలను చూసే సౌలభ్యం ఉంటుందని, వీరి వెంట ఐఆర్‌టీసీ టూర్‌ మేనేజర్‌ కూడా ఉంటారని పేర్కొంది. దిల్లీ నుంచి బయలుదేరిన రైలు మొదట రాముని జన్మస్థానమైన అయోధ్యకు చేరుకుంటుంది. అనంతరం హనుమాన్ గర్హి, కనక్‌ భవన్ ఆలయం, నందిగ్రామ్, సీతామర్హి, జానక్‌పూర్, వారణాశి, ప్రయాగ, తదితర ప్రాంతాలకు చేరుకుంటుంది.  శ్రీలంకలోని ప్రాంతాలను దర్శించడానికి మాత్రం కొంతమొత్తం చెల్లించి విమానంలో అక్కడికి చేరుకోవాలని వెల్లడించింది. ఈ ప్యాకేజీ ధర రూ.47,600లని వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌ ఆగష్టు 28 నుంచి సెప్టెంబరు 9 వరకు రామాయణ ప్రాంతాలను చుట్టివస్తుందని, త్రివేండ్రం నుంచి ఇది మొదలవుతుందని వెల్లడించింది. ఈ ప్యాకేజీ కింద రూ.39,800 వసూలు చేయనున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!