• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • బ్రాహ్మణులకు రూ 20 లక్షల స్వల్ప రుణాలు అందజేత (12/7/18)

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18..   10.30am)
                  ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణులకు పెద్ద పీట వేశారని, సంక్షేమ పథకాలతో వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్, జిల్లా బ్రాహ్మణా క్రిడెట్ సొసైటీ ఆధ్వర్యంలో  స్వల్ప రుణాలను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఈ రుణాలను బ్రాహ్మణులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా బ్రాహ్మణా క్రిడెట్ సొసైటీ అధ్యక్షులు శ్రీశ్రీశర్మ మాట్లాడుతూ క్రిడెట్ సోసాటి ద్వారా బ్రాహ్మణులకు వృత్తి వ్యాపార రీత్యా  స్వల్ప రుణాలు అందిస్తున్నారని అన్నారు. అనంతరం సుమారు 20 లక్షలను కార్పొరేషన్ ద్వారా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంజిబాబు చేతులమీదుగా లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, తోట బోగయ్య, వేలూరి సుబ్రహ్మణ్యం, నందమూరి ఆంజనేయులు, వేలూరి బుజ్జి, చెరుకువాడ రంగసాయి, ఏలూరి శ్రీధర్, గున్నేశ్వరరావు, చెరుకుపల్లి సంతోష్, వాసు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!