• Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ఇంజనీరింగ్ విద్యార్థికి రూ 15 వేలు ఆర్ధిక సహాయం (12/7/18)

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18.. 04.30pm)
                   ప్రతిభావంతులను ప్రోత్సహించడం సామాజిక బాధ్యతని, ప్రతిభ కలిగి పేదరికంతో ఎంతోమంది వెనుకంజలో ఉంటున్నారని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థికి గురువారం రూ 15 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా కమిషనర్ నరసింహారావు మాట్లాడుతూ దాతలు ప్రతిభావంతులకు అన్నివేళలా సహాయ సహకారాలను అందిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో రెండో సంవత్సరం బిటెక్  చదువుతున్న అనిల్ కుమార్ కు  దాతలు మానేపల్లి నాగన్నబాబు, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు రూ 10 వేలు, నందమూరి ఆంజనేయులు రూ 5 వేలు ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో చెల్లబోయిన సుబ్బారావు, నందమూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!