• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • విద్యతోపాటు కొన్ని అంశాలపై దృష్టి సారించాలి .. ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు (12/7/18)

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18.. 04.30pm)
                  విద్యతోపాటు కొన్ని మంచి అంశాలపై దృష్టి సారించాలని, కరాటే యోగ బాక్సింగ్ లాంటి లాంటి క్రీడలలో యువకులు శిక్షణ పొందటం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని కేజీఆర్ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ కె నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు బ్యాంకాక్ కు వెళుతున్న మనోజ్ వర్మ కు  శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గురువారం కేజీఆర్ఎల్ కళాశాలలో దాతల సహకారంతో ఆర్ధిక సహాయం,  కరాటే మాస్టర్ చిరంజీవి కు సత్కారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి అంశాలపై శిక్షణ పొందటమే కాకుండా వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ కరాటే మాస్టర్ చిరంజీవి ఇప్పటికి 2 వేలమందికి కరాటే, బ్యాక్సింగ్ లో శిక్షణ ఇచ్చారని, వీరిలో 300 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని అన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు బ్యాంకాక్ కు వెళుతున్న మనోజ్ వర్మ కు రూ 7 వేలు ఆర్ధిక సహాయం అందించామని తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!