• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • "విజేత" చిత్రం విడుదల .. పట్టణంలో విజయోత్సవ సంబరాలు (12/7/18)

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18.. 04.30pm)
                     మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన "విజేత" చిత్రం విడుదల సందర్బంగా గురువారం భీమవరం కిషోర్ థియేటర్ లో చిరుపవన్ తేజం, మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా మెగా ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు  అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ కళ్యాణ్ దేవ్ నటించిన మొదటి చిత్రం "విజేత" విజయోత్సవం సాధించిందని, మెగా ఫ్యామిలీ నటనకు పెద్ద పీట వేస్తుందని మరోసారి రుజువు చేసారని అన్నారు. కళ్యాణ్ దేవ్ మరెన్నో చిత్రాల్లో నటించాలని, ప్రేక్షకులు, అభిమానుల ఆదరణ ఎప్పటికి ఉంటుందని అన్నారు. ముందుగా కేకును కట్ చేశారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ పానుగంటి చినబాబు, కొప్పర్తి కోటి, కళ్యాణ్, వాకా రమేష్, పంతం ప్రసాద్, రాంబాబు, అప్పలనాయుడు, మాదాసు ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణ, బాబీ తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!